ఫ్యాషన్ ట్రెండ్ లో స్టైల్ గా కనిపించాలంటే?

VAMSI
ప్రపంచమంతా ఇపుడు ఫ్యాషన్ రంగం చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. మహిళల్లో సెలబ్రిటీలు అయినా సాధారణమైన వ్యక్తులైనా ఫ్యాషన్ గా ఉండాలని, మోడ్రన్ గా కనిపించాలని ఆరాట పడే రోజులివి, అందుకు తగ్గట్టుగా పరుగులు తీసే కాలంలో ఇవి కొందరికి తప్పనిసరి అవుతున్నాయి. కాలేజ్ కి వెళ్లే వారు, ఉద్యోగానికి వెళ్లే వారు, ఇలా నలుగురిలో తిరగాల్సి వచ్చినప్పుడు మోడ్రన్ గా కనిపించడం, ట్రెండీ లుక్ తో ఉండటం సర్వ సాధారణం అయిపోయింది. మరీ సాదా సీదాగా ఉన్నా బాగోదు. అయితే ట్రెండీ లుక్ తో కాస్త మోడ్రన్ గా కనిపించాలి అనుకునే వారి కోసం ఈ టిప్స్.
* ముందుగా మనల్ని చూడగానే అట్రాక్ట్ చేసే పేస్ విషయంలో అలెర్ట్ గా ఉండాలి. ఫ్రెష్ గా కనిపించాలి అంటే మీ ముఖం కాంతి వంతంగా ఉండాలి. అందుకోసం వారానికి రెండు సార్లైనా మీ ముఖానికి శనగ పిండి, లేదా ఇంకేదైనా బ్యూటీ ఫేస్ ప్యాక్ లు వాడడం మంచిది.
* డ్రెస్ వేసుకునే ముందు మీకు ఆ కలర్ ఎలా ఉంది అన్నది ముందు మీరు చెక్ చేసుకోండి. అందుకు తగ్గట్లుగా హెయిర్ స్టైల్ చూసుకోండి. హెయిర్ స్టైల్ సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది.
* మేకప్ మరీ ఎక్కువగా కాకుండా లైట్ గా చేసుకోండి. మేకప్ ఇష్టం లేని వారు కనీసం మేకప్ పౌడర్, కాజల్ లైట్ గా వేసుకోవాలి. చేతికి వాచ్, అంతే ఇలా సింపుల్ గా ఉన్నా చాలు ట్రెండీగా కనిపిస్తారు.
* డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాచింగ్ చూసుకొని వేసుకోవాలి. ఆ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా వాచ్, హ్యాండ్ బ్యాండ్, ఫ్లక్కర్ లు ఉపయోగిస్తే ఇంకా అందంగా కనిపిస్తారు.
* అయితే ఇవన్నీ చేసుకున్నా కూడా కొందరు మాత్రం అంత ప్రకాశవంతంగా కనిపించరు. అందుకోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే ముఖంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండాలి. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించాలి అప్పుడే మీ అందం మరింత రెట్టింపు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: