మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా... ఇలా చేసి చూడండి ?

VAMSI
మిమ్మల్ని ఎదుటి వారు చూడగానే ఆకర్శించేది మీ ముఖం. అలాంటి ముఖం ఆకర్షణీయంగా కనిపించాలంటే మచ్చలు, దద్దుర్లు లేకుండా మృదువుగా ఉన్నప్పుడే మరింత అందంగా కనపడుతారు. అయితే చాలా మంది ముఖంపై వచ్చే మొటిమలతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అన్ని వయసుల వారికి మొటిమెలు వస్తుంటాయి. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వారికి ఎక్కువగా మొటిమలు వస్తుంటాయి. వీటి వలన చర్మంపై దురద ఏర్పడుతుంది. వాటిని చిదిమేయడం వలన మచ్చలుగా మారి ముఖం అసహ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి వారు మొటిమెల నుండి తమ ముఖాన్ని కాపాడుకోవడానికి ఈ కింది చిట్కాలను పాటించండి.
* బేకింగ్ సోడా మొటిమలపై చక్కటి రెమిడీలా పనిచేస్తుంది. కొద్దిగా వంట సోడాను తీసుకుని నీటిలో కలపాలి. ఆ తర్వాత కలిపిన మిశ్రమాన్ని మొటిమలపై రాయాలి. లేదా మచ్చలు ఉంటే వాటిపై సర్కిల్ షేప్ లో మసాజ్ చేయాలి. అలా అప్లై చేసుకున్న తరవాత ఒక పది, పదిహేను నిమిషాలు ఆగి ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడుక్కోవాలి. ఒక అర గంట వరకు సోపు వాడకూడదు.
* బంగాళ దుంపలను కట్ చేసి ఆ ముక్కను మొటిమలు ఉన్న చోట కానీ మచ్చలు ఉన్న చోట కానీ నిదానంగా మసాజ్ చేయాలి. బంగాళా దుంపల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటం వలన మొటిమలపై మచ్చలపై ప్రభావాన్ని చూపి వాటిని తగ్గిస్తుంది.
* నిమ్మ రసం కూడా మొటిమలపై చక్కగా పనిచేస్తుంది. ఒక నిమ్మ చక్కని తీసుకుని దానిని పెరుగులో అద్దుతూ మొటిమలు లేదా మచ్చలు ఉన్న చోట చిన్నగా మసాజ్ చేయాలి. ఇలా చేశాక ఒక పది నిమిషాలు ఆగి చల్లటి నీటితో కడిగేయాలి. నిమ్మకాయను ఎప్పుడూ నేరుగా ముఖానికి అప్లై చేయకూడదని కొందరు నిపుణులు చెబుతున్న సలహా.
మీరు ఈ చిట్కాలను పాటిస్తారని ఆశిస్తున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: