జుట్టు బలహీనం కావడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

Divya

సాధారణంగా వాతావరణంలో కలుషితం కారణంగా లేదా మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం కారణంగా, జుట్టు రాలిపోవడం , జుట్టు బలహీనంగా మారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా  జుట్టు బలహీనమవ్వడానికి లక్షణాలు ఏమిటంటే,  అధిక జుట్టు రాలడం, జీవంలేని జుట్టు , జుట్టు చిట్లిపోవడం , పొడిబారిపోవడం, గిరజాల జుట్టు ,అల్లిన జుట్టు,  హెయిర్ ఫోలికల్స్ తగ్గడం , ఏ స్టైల్ కి వర్తించని వదులుగా ఉండే జుట్టు రకం ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు..
అయితే వీటన్నింటికి కారణాలు ఏమిటంటే , మీ జుట్టు యొక్క నాణ్యత అలాగే బలాన్ని నిర్ణయించడంలో జన్యువులు కీలకపాత్ర పోషిస్తాయి.  ఇక జుట్టు యొక్క అలంకరణ పై ఆధారపడి, మీకు అందమైన జుట్టు అలాగే మృదువైన జుట్టు ఉండవచ్చు. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల నుండి కూడా పొందవచ్చు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కొన్ని సమస్యలు కూడా ఇలాంటి జున్ను అలంకరణ పై ఆధారపడి ఉంటాయి..

ఇక అంతే కాకుండా జుట్టుకు ఎక్కువ వేడి తగిలించడం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది. వేడి  జుట్టు కుదుళ్లు తాకినపుడు తల మీద ఉండే నూనె లు  బయటికి  పోయి , చర్మం దెబ్బతింటుంది.  అలాగే కుదుళ్ళు నష్టపోయి జుట్టుకు  నష్టం కలుగుతుంది. అయితే ఇలాంటి  సమస్యల నుండి జుట్టును  రక్షించడం సాధ్యం కాదు. ఇక అలాగే జుట్టుకు ఉపయోగించే హెయిర్ డై ల  కారణంగా కూడా జుట్టు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  అంటే ఈ డై లో ఉపయోగించే రసాయనాల కారణంగా జుట్టు బలహీనంగా మారి , జుట్టు రాలడానికి దారితీస్తుంది..
సాధారణంగా జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు ఒక ముఖ్యమైన అంశం. హెయిర్ ఫోలికల్స్ తగినంత ప్రోటీన్ ను పొందలేని సమయంలో జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి . ఫలితంగా జుట్టు రాలడం మొదలవుతుంది. అలాగే మన శరీరంలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా హార్మోన్ల అసమతుల్యత జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఇక ఇందులో పిసిఓఎస్ తో పాటు మోనోపాజ్ కూడా అసాధారణ జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది..
ఇక మనం తీసుకొనే ఆహారంలో సరైన విటమిన్లు ,ఖనిజాలు ,ప్రోటీన్లు లేకపోవడం వల్ల కూడా జుట్టు పెరుగుదల ఆగిపోతుంది.. ఇవన్నీ కూడా జుట్టు బలహీనమడానికి కారణాలుగా చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: