ఈ ఎండాకాలంలో సెలబ్రెటీలు చెప్పే మేకప్ టిప్స్ ఏంటో మనం కూడా తెలుసుకుందామా..?

Divya

మన సెలబ్రిటీలు ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వీళ్ళు ఉపయోగించే వివిధ రకాల మేకప్ టిప్స్ ఏంటో మనకు తెలిస్తే, మనం కూడా అంతే అందంగా ఉండవచ్చు.. అయితే ఇక్కడ సెలబ్రిటీలు కూడా మనకు కొన్ని రకాల మేకప్ టిప్స్ ను ఇచ్చారు. వీటిని మనం కూడా అనుసరించాము అంటే ఖచ్చితంగా అందంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఈ మేకప్ టిప్స్ ను వాడడం వల్ల మీరు కూడా సెలబ్రిటీల లాగా మారిపోతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అయితే ఈ వేసవి కాలంలో ఎలాంటి మేకప్ వేసుకున్నా సరే ఖచ్చితంగా కరిగిపోతుంది. ఈ కాలంలో లైట్ గా ఉండే టోన్స్ ను ఉపయోగిస్తే బాగుంటుంది. అలాగే పెదవులకు పింక్ లిప్ స్టిక్, పీచ్ కూడా బాగుంటుంది.. సింపుల్ గా ఉండే ఈ లుక్ సమ్మర్ లో చాలా బాగుంటుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..

నూడ్ మేకప్ లుక్ :
ఈ సరికొత్త మేకప్ సెలబ్రిటీలకు న్యూ లుక్ ఇవ్వడంతో వారు కూడా ఈ లుక్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇక దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఇష్టపడక తప్పదు. అయితే ఈ లుక్ ను మీరు కూడా ఉపయోగించాలి అంటే వీరు చెప్పినట్టు అనుకరించాలి. అదేమిటంటే మేకప్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఫౌండేషన్ వేసుకోకూడదు. ఇక దానికి బదులు బిబి క్రీమ్ వాడొచ్చు. ఇక అలాగే ఐ లైనర్, కాజల్ కి బదులు మీ కళ్ళకు కేవలం మస్కారా ను మాత్రమే ఉపయోగించండి. అప్పుడే ఈ నూడ్ మేకప్ కు సరైన లుక్ వస్తుంది. పైగా వేసవికాలంలో చెమటలు కారణంగా మేకప్ తొలగిపోతుంటే, ఈ నూడ్ మేకప్ చెమటలకు మేకప్ కరిగిపోకుండా చేస్తుంది..

ఇక పెదవుల కోసం చాలా టైట్ గా ఉండే షేడ్స్ ను ఉపయోగించవచ్చు.  ముఖ్యంగా పింక్ లేదా పీచ్ కలర్ ను ప్రిఫర్ చేయండి. ఇలాంటి లైట్ గా ఉండే లిఫ్ట్ స్టిక్ ని మీ పెదవులకు వాడినప్పుడు నిజంగా ఈ నూడ్ మేకప్ చాలా బాగుంటుంది. ఈ మేకప్ ను మీరు కూడా ఒక సారి ప్రయత్నించి, మీ అందాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: