మీ చర్మం మరింత సౌందర్యంగా కనిపించడానికి ఈ సహజ చిట్కాలు పాటించండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది అందంగా ఉండటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. కాని వర్క్ ఔట్ అవ్వదు. కాబట్టి ఈ పద్ధతులు పాటించండి. ఖచ్చితంగా మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది..ఇక సాధారణంగా బయట ఎండన పడి తిరిగి వచ్చినప్పుడు ముఖం టాన్ అవుతుంది. అలాంటప్పుడు స్ట్రాబెర్రీ, మిల్క్ క్రీంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ట్యాన్‌ను చాలా ప్రభావవంతంగా పోగొడుతుంది. అంతేకాదు డార్క్ స్పాట్స్ ని సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది.కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని స్పూన్ సాయంతో లేదా బ్లెండర్‌లో వేసి మెత్తగా చేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.
నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలుంటాయి. ఇవి ట్యాన్‌ను పోగొట్టి చర్మాన్నిమెరిపిస్తాయి. దీనికి రోజ్ వాటర్, కీర దోస రసం కూడా కలిపితే.. ఎండలో వదిలిపోయినట్లుగా తయారైన చర్మానికి తిరిగి జీవకళ అందుతుంది. ఈ మిశ్రమం చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్‌ను సైతం తగ్గిస్తుంది.టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, కీర దోస రసం, రోజ్ వాటర్ తీసుకోవాలి. ఈ మూడింటిని గిన్నెలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ముఖానికి రాసుకోవాలి. పావుగంట లేదా ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇక బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ చర్మంపై ట్యాన్ ని పొగడతాయి.ఇవి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు మృతకణాలను తొలిగించి చర్మాన్ని అందంగా మారుస్తాయి. తేనెలోని గుణాలు చర్మానికి పోషణనిస్తాయి.బాగా ముగ్గిన బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి.. రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: