సున్నిపిండితో సౌందర్యానికి కొన్ని చిట్కాలు

Durga
 ముఖం, శరీరం నిగనిగలాడుతూ ఉండాలంటే ప్రతి రోజూ ఉసిరికాయ తినాలి. ఉసిరికాయ శరీరానికి మాత్రమే కాకుండా మెరుపు కూడా ఇస్తుంది. చర్మం చిట్లి, బరువెక్కినట్లుగా వుంటే శరీరానికి పెరుగురాసి, అరగంట ఆగిస్నానం చేయండి ఆ బాధ నుండి విముక్తి కలుగుతుంది.  జుట్టు నిగనిగలాడతూ మెరవాలంటే కోడిగ్రుడ్డు సొనలో అరటిపండుని బాగా కలిపి, ఆ పేస్టుని తలకి రుద్దుకుని పావుగంట ఆగి శుభ్రంగా తలస్నానం చేయాలి. పిల్లల అంటుకుపోయిన జుట్టు విడిపోవాలంటే అక్కడ కొంచెం ఆలివ్ ఆయిల్ ని రాసి పావుగంట తర్వాత పొడి బట్టతో తుడవండి. పిల్లలకి సున్నిపిండి వాడితే చర్మ వ్యాధులు రాకుండా వుండటమే కాక, శరీరం మీద నూగులాంటి రోమాలు కూడా పోతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: