నిమ్మరసం, తులసి రసం కలిపి పట్టిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

kalpana
ప్రతి ఒక్కరూ అందంగా కనపడాలని కోరుకుంటారు. అందంగా కనపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు బ్యూటీ పార్లర్ ల కి వెళుతుంటారు. అవన్నీ తాత్కాలికం మాత్రమే,మన ఇంట్లో దొరికే వాటితోనే అందంగా తయారవ్వచ్చు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 చర్మము అందంగా కనబడటానికి మీగడలో పసుపు కలిపి చర్మానికి రాసి పది నిమిషాల తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయండి.
 ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తులసి రసం కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.
 శరీరం నలుపు పోగొట్టడానికి, పచ్చి పాలతో పసుపు కలిపి అందులో  దూది కలిపి కొద్దిసేపు ఫ్రిజ్లో పెట్టుకోవాలి.రోజుకు ఒకసారి దూదిని తీసుకుని తెల్లని శరీరం పై దిద్దాలి. తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల నలుపు దూరమవుతుంది.
వారానికి రెండు మూడు సార్లు పచ్చి బంగాళాదుంప రసం ముఖానికి పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
 పొడి చర్మం ఉన్నవాళ్లు శనగపిండి, నెయ్యి, పసుపు మూడింటినీ కలిపిపేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును చర్మానికి పట్టించి కొద్ది సేపు అయిన తర్వాత గుండ్రంగా మసాజ్ చేయాలి. చేయడంవల్ల పొడిబారిన చర్మంపై మురికి పోయి నలుపు తగ్గుతుంది
 శెనగపిండి, పచ్చి పాలు, పసుపు కలిపి ప్రతిరోజు స్నానానికి ముందు ఈ మిశ్రమాన్ని శరీరానికి రాయండి.ఆ తర్వాత స్నానం చేయండి.
 గంధం పొడి, పసుపు రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి పట్టించండి. మొఖం మెరుస్తూ ఉంటుంది.
 బాదంపాలు ముఖానికి పట్టించి రాత్రంతా అలానే ఉంచడం వల్ల ముఖం నిగారింపుగా ఉంటుంది. అలాగే బాదంపప్పును నానబెట్టి పచ్చి పాలతో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. పేస్టును ముఖానికి పట్టించి గంట సేపు నుంచి కడిగేసుకోవాలి.                                                                                                                                                                                                                                

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: