మొటిమలు, మచ్చలతో బాధ పడేవారు ఈ ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకొండి...
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది మొటిమలు, మచ్చలతో చాలా బాధ పడుతూ ఉంటారు.. అలాంటి వారు ఈ రెండు ఆయుర్వేద ప్యాక్ లను తయారు చేసుకోండి. మీ ముఖం చాలా అందంగా కాంతి వంతంగా ఉంటుంది...
1..కావలిసిన పదార్థాలు...ఒక టీ స్పూన్ - పసుపు
- ఒక టీ స్పూన్ - వేపాకు పొడి
- 2 టీ స్పూన్లు - ముల్తానీ మట్టి
- అర టీ స్పూన్ - మంజిష్ఠ
- 3-4 టీ స్పూన్లు - పాలు
- ఒక టీ స్పూన్ - నీళ్ళు
ఒక గిన్నెలో పై పదార్థాలను తీసుకుని బాగా కలపండి. దాన్ని మీ ముఖానికి రాసుకోండి. ఒక 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో ముంచిన రుమాలుతో తుడవాలి. మంచి ఫలితాల కోసం, ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 3,4 సార్లు వాడండి.
2...కావలిసిన పదార్థాలు...అర టీ స్పూన్ - పసుపు
- ఒక టీ స్పూన్ - వేపాకు పొడి
- ఒక టీ స్పూన్ - మునగాకు పొడి
- ఒక టీ స్పూన్ - అతిమధుర పొడి
- ఒక టీ స్పూన్ - మంజిష్ఠ
- మూడు టీ స్పూన్లు - ముల్తానీ మట్టి
- ఒక టీ స్పూన్ - తేనె
- 2-3 టీ స్పూన్లు - పాలు మరియు నీళ్ళు
తయారీ విధానం....పైన పదార్థాలను బాగా కలిపిన తరువాత ఆ మిశ్రమాన్ని మీ ముఖం మీద అప్లై చేయండి. ఫేస్ ప్యాక్ బాగా ఎండి పగలడం మొదలైన తరువాత దాన్ని తీసెయ్యండి. అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే అది మీ చర్మంలోని తేమను తీసివేస్తుంది కాబట్టి త్వరగా తీసెయ్యండి.
ఈ ప్యాక్ లని క్రమం తప్పకుండా రోజు వేసుకుంటే గ్యారెంటీగా మొటిమలు, మచ్చలు పోయి ముఖం చాలా ఫ్రెష్ గా అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...