ముఖ సౌందర్యానికి చిట్కాలు!

Sahithya
ఈ రోజుల్లో అందంగా ఉండాలి అని ఎవ్వరికి ఉండదు చెప్పండి.పిల్లలు నుంచి పండు ముసలి వరకు అందం గా ఉండాలి అని అనుకుంటారు . ఈ రోజుల్లో చిన్న పెద్ద అందరూ  అందంగా కనపడటానికి చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఒకో సారి అవి వికటించి ప్రమాదానికి గురవుతున్నారు. లేదా బ్యూటీ పార్లర్ వెంట పరుగులు పెడుతున్నారు. అక్కడ వాడే కాస్మోటిక్స్ వల్ల  అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దానితో పాటు ముఖం యొక్క నిగారింపు తగ్గిపోతుంది. వీటన్నిటి నుండి బయటపడటానికి మన ఇంటిలోనే సహజ సిద్ద ఔషధాలతో ముఖం కాంతివంతంగా మార్చుకోవచ్చు.అందం గా ఉండొచ్చు 

ముఖ సౌందర్యానికి ఇంటి చిట్కాలు: ఒక స్పూన్ పసుపు లో పాలమీద మీగడ, శనగ పిండి కలిపి ప్రతి రోజు రాసుకుంటే ముఖచర్మం స్మూత్ గా,కాంతివంతంగా ఉంటుంది. జీలకర్ర, పసుపు, గంధం పొడి కలిపి మెత్తగా నూరి ప్రతిరోజు రాసుకుంటే ముఖ సౌందర్యం అద్భుతంగా వృద్ది చెందుతుంది. దాల్చిన చెక్క పొడి, నిమ్మరసం సమ పాళ్ళ లో కలిపి మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న చోట రాస్తే అవి పోతాయి. పెసర పిండిని ముఖానికి పట్టించి నీటితో శుభ్ర పరుస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే చర్మం కాంతివంతంగా మారుతుంది.

సెనగ పిండిలో పాల మీద మీగడ, కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేస్తే మొటిమలు రావు. లేత కొబ్బరిని ప్రతి రోజు ముఖంపై రాస్తూ ఉంటే చర్మం స్మూత్ గా మారి మొటిమలు రానివ్వవు. తోట కూర రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం పై ముడతలు పోతాయి. ఇంకా గులాబి రేకులు ముద్దగా నూరి ముఖానికి ప్యాక్ లాగా వేస్తే మంచి ఉపయోగం. బంతి పువ్వుల రేకులు నూరి అందులో కొంచెం తేనె కలిపి ముఖానికి రాస్తే ముఖం కళకళలాడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: