అందం కోసం 5 చిట్కాలు...!

Sahithya
అందంగా ఉండాలని భావించే వారు చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి అందంగా ఉండాలి అని భావించే వారికి 5 చిట్కాలు చెప్తాను. అసలు ఎలా ఏంటీ అనేది చూడండి.
శరీరం డీహైడ్రేట్‌ అవకుండా ఉండటం కోసం ఎప్పుడూ మనం నీళ్లు తాగుతూనే  ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఇది చర్మం తేమను కోల్పోకుండా ఉండటానికి సహాయపడుతుందని చెప్తున్నారు.. వీలైతే నిమ్మ, దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్ల రసాలను తాగితే మనకు చాలా వరకు మంచి చేస్తాయి.
అంతే కాకుండా చర్మం పొడిబారకుండా తేమతో కూడిన ఆయిల్స్‌ ను అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే స్నానానికి వెళ్లే ముందు ఆయుర్వేద ఆయిల్‌ ను ఒంటికి పట్టించుకుని ఆ తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే బలవర్థకమైన ఆహారం కూడా ఎక్కువగా తీసుకోవాలి. తాజా కొబ్బరి, బాదం పప్పుతో పాటుగా అవకాడో, ఆలివ్‌ ఆయిల్‌, నెయ్యి, చేపలు వంటి సంతృప్తికర కొవ్వును అందించే ఆహారాన్ని మనం రోజు వారీ డైట్‌ లో చేర్చుకోవాలి అని సూచనలు చేస్తున్నారు. ఇవి ఎక్కువగా తీసుకుంటే మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా కనిపించేందుకు దోహదం చేస్తాయని చెప్తున్నారు.
బద్దకంగా ఎక్కువగా ఉన్నా సరే నష్టమే. కాసేపు శరీరానికి శ్రమ కూడా ఇవ్వాలి. యోగా, ఎక్సర్‌ సైజ్‌ ఏదైనా సరే క్రమం తప్పకుండా కాసేపు వ్యాయామాన్ని చేయడం అలవాటు చేసుకోండి. ఏదోక కారణం చెప్పి తప్పించుకోకుండా కనీసం ఏదొకటి చేసే అలవాటు చేసుకోవడం అనేది చాలా మంచిది. చేయండి.
గ్లిజరిన్‌ లో నిమ్మ రసం కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుని పెట్టుకోవాలి. దీనిని మనం ప్రతిరోజు కూడా ఓ మాయిశ్చరైజర్‌లా అప్లై చేసుకుంటే చాలు. ముఖానికి అప్లై చేసిన గంట తర్వాత కడిగితే చర్మం సున్నితంగా, కాంతివంతంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: