ఆడాళ్ళు సింపుల్ గా అందం చిట్కాలు ఫాలో అవ్వండి...!

Sahithya
అందం కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా సరే పాపం చాలా ఇబ్బంది  పడినా సరే కనీసం ఫలితం ఉండదు. అలాంటి వారికి కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు. జుట్టుకు మాస్క్‌లా పెరుగునీ ఉపయోగించవచ్చు. పెరుగుని జుట్టుకు పట్టించి పావుగంట తరువాత కడిగేస్తే జుట్టు పట్టులా చాలా బాగుంటుంది. బయటకు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా ఉండవచ్చు.

స్త్రీలలో దట్టమైన కనుబొమలు, పై పెదవి మీద వచ్చే అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడతాయి. అవి ఇంట్లోనే చాలా ఈజీగా పరిష్కారం చూపించుకోవచ్చు. ఐ బ్రోస్‌ పెరిగినట్టయితే ట్వీజర్స్‌తో నెమ్మదిగా తీసుకోవచ్చు. ఐ బ్రో లైన్‌ దెబ్బతినకుండా జాగ్రత్తగా హెయిర్‌ రిమూవ్ చేయాలి. ఒకవైపు నుంచి మొదలుపెట్టి కంగారు లేకుండా చేసుకోవాలి. అవాంఛిత రోమాలను ఫేషియల్‌ బ్లేడ్‌ తో తీసుకోవచ్చు. ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలను రిమూవ్ చేసుకోవడానికి డిజైన్‌ చేసిన రేజర్లు ఉన్నాయి.

వ్యాక్స్‌ ఇంట్లో కూడా చాలా ఈజీ గా చేసుకోవచ్చు. బ్యూటీ ఉత్పత్తులు అమ్మే షాపులలో వ్యాక్స్‌ దొరుకుతుంది. కొన్ని చోట్ల ఇంకా దుకాణాలు ఓపెన్ లేదు కాబట్టి ఇంట్లోనే వ్యాక్స్ చేసుకోవచ్చు. పంచదార, తేనె, నిమ్మరసం కలిపి వేడి చేసి  పంచదార కరిగి, మిశ్రమం చిక్కగా అయ్యాక దింపేస్తే ఈ మిశ్రమాన్ని కాళ్లు, చేతులకు వ్యాక్స్‌ గా వాడవచ్చు. ఇంట్లో ఫేషియల్‌ గా పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్‌ ప్యాక్‌లా చేసుకుంటే చాలు.

పసుపులో రోజ్‌ వాటర్‌ కలిపి కూడా చేసుకోవచ్చు. ఓట్స్‌, తేనె, ఆలివ్‌ ఆయిల్‌ ను మిశ్రమంగా తీసుకుని ముఖంపై నెమ్మదిగా మర్దన చేస్తే చాలు. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే చాలు. ఒక టబ్‌లో గోరు వెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌, కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి కాళ్లు పెడితే  కాళ్ళు చాలా అందంగా ఉంటాయి. సెనగపిండి, పాలు, పసుపు, తేనె కలిపి పేస్టులా చేసి కాళ్లకు ప్యాక్‌ లా  చేసి పది నిమిషాల్ తర్వాత కడగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: