అమ్మాయిలూ అందం కోసం ఇలా చేయండి...!

Sahithya
అందంగా ఉండాలి అని ఏ అమ్మాయికి మాత్రం ఉండదు చెప్పండి. అసలు అందం కోసమే మేము పుట్టామా అనే విధంగా చేస్తూ ఉంటారు అమ్మాయిలు. ఏమైనా అంటే ఫీల్ అవుతారు గాని వారికి అందం మీద ఉన్న ప్రేమ మరో దాని మీద ఉండదు. మరి అబ్బాయిలు అందంగా ఉన్న వారినే చూస్తే వాళ్ళు మాత్రం ఎం చేస్తారు చెప్పండి. ఫేస్బుక్ లైక్స్ వచ్చేది అందంగా ఉన్న అమ్మాయిలకే కదా అనే ఫీలింగ్ కూడా ఉంది మరి. అందుకే అందంగా ఉండటానికి ఈ రోజులు చాలా మంది అమ్మాయిలు ఇదే విధంగా ఆలోచిస్తున్నారు.

అందంగా లేకపోవడం ఏదో పాపం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అండి బాబు. అలాంటి వాళ్లకు నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తాను ట్రై చేయండి. ఎలా  ఏంటీ అనేది చదివి మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ లకు ఎక్కువగా రసాయనాలు ఉండేవి వస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా ఇంటి వద్ద తయారు చేసుకునే ఫేస్‌ ప్యాక్‌లు మాత్రమే వాడడం చాలా బెటర్. సోంపు మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అని నిపుణులు చెప్తున్నారు.

చాలా ఫాస్ట్ గా మీకు అందమైన గ్లో తెస్తుంది. టీ స్పూన్‌ సోంపును మెత్తటి పొడిగా చేసుకోండి.  ఆ తర్వాత ఆ  పొడిని ఒక గిన్నె లో తీసుకొని టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ పెరుగు కలపండి. ఈ ఫేస్‌ ప్యాక్‌ను బ్రష్‌ సాయంతో ముఖం, మెడ చుట్టూ రాసుకోండి. సరిగా పది నిమిషాలు అయిన తర్వాత స్క్రబ్బర్‌ సాయంతో దాన్ని తొలగించి, చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోండి చాలు. అలాగే రెండు టేబుల్‌ స్పూన్ల సోంపును గ్లాసు నీళ్లలో తీసుకొని మరగబెట్టండి. అది చల్లారిన తర్వాత ఆ సోంపు నీటిని ముఖానికి టోనర్‌ గా రాసుకోండి. అలా చేయడంతో మచ్చలు తొలగి, ముఖం చాలా తాజాగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: