మెరిసేదంతా బంగారం కాదు.. చర్మ సౌందర్యపు ఈ రహస్యం మీకు తెలుసా..?

shami

ఆరోగ్యవంతమైన మనిషి యొక్క ముఖ వచ్చస్సు వేరేలా ఉంటుంది. ముఖ్యంగా చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రకాశవంతంగా అనిపిస్తుంది. మాములుగా చర్మానికి క్లేన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజ్ చేసుకుని స్కిన్ కేర్ తీసుకుంటాము. మార్కెట్ లో రిలీజ్ అయ్యే కొత్త ఉత్పత్తులను జస్ట్ ఇలా టివిలో యాడ్ చూసి ఫలనా హీరోయిన్ పూసుకుని అందంగా మెరిసిపోతుందని మనం కూడా ఇంటికి తెచ్చేసుకుంటాం. కాని అసలు విషయం ఏంటంటే మెరిసేదంతా బంగారం కాదు అని మనం గుర్తించాల్సిందే.  

  

మన స్కిన్ కు ఏ ఉత్పత్తులు నప్పుతాయి.. సూట్ అవుతాయి అన్నది చూసుకుని అలాంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడుకోవాలి. కొన్ని ప్రొడక్ట్స్ మొదటిసారి ఫలితాలు బాగానే ఇచ్చినా వాటిని రిపీట్ చేస్తున్నా కొద్దీ చర్మ సంబందిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్కిన్ టోన్ ను బట్టి వారి ప్రొడక్ట్స్ సూట్ అవుతాయని చెప్పొచ్చు.  

 

మేకప్ వేసుకుని అందంగా కనిపించడం చాలా తేలిక కాని మన స్కిన్ కు నప్పని కొన్ని ప్రొడక్ట్స్ వాడటం వల్ల కచ్చితంగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇక ఆల్రెడీ అలాంటి ప్రొడక్ట్స్ వాడి చర్మ సమస్యలతో బాధపడే లేదా ఇదివరకులా ఫేస్ లో షైనింగ్ లేదని బాధపడే వారు. నిమ్మరసం చర్మానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక టమాటా, ఎర్ర కందిపప్పు, కలబందతో కలిపి చేసుకున్న ఫేస్ ప్యాక్ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. స్ట్రాబెర్రీ, మిల్క్ క్రీం మిశ్రమం కూడా చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. బొప్పాయి, తేనే ఫేస్ ప్యాక్ కూడా చర్మాన్ని కాపాడుతుంది. ఇలా ఆల్రెడీ కొన్ని ఉత్పత్తులను వాడి చర్మ సౌందర్యాన్ని కోల్పోయిన వారు పై చెప్పిన ఇంట్లో దొరికే వాటితో తిరిగి మునుపటి రూపం పొందుతారు.          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: