తల జిడ్డు జిడ్డుగా ఉందా? అయితే నిమ్మకాయను వాడండి!

Durga Writes

మనం ఎన్ని షాంపూలు వాడిని ప్రయోజనం ఉండదు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఉపయోగం ఉండదు. దీనికి కారణం వాతావరణం. వాతావరణం కాలుష్యం కారణంగా తల జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఆ జిడ్డుని పోగొట్టటానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన సరే ఉపోయోగం ఉండదు. అయితే అలాంటి జుట్టుకు జిడ్డు జిడ్డుగ ఉండకుండా అందంగా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఆలివ్‌నూనె, తేనెను రెండింటినీ కలిపి కాస్త గోరువెచ్చగా చేసి తరువాత తలకు కాకుండా మిగిలిన జుట్టుకు పట్టించి 20 నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరిసిపోతుంది. 

 

జుట్టు చివర్లో చిట్లిన సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. దాన్ని నివారించాలంటే అరకప్పు పెరుగులో పావుకప్పు బొప్పాయి గుజ్జు కలిపి తలంతా పట్టిస్తే అరగంటాగి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. 

 

కలబంద గుజ్జులో పెద్ద చెంచాడు నిమ్మరసం, రెండు పెద్ద చెంచాల ఆముదం కలిపి తలంతా రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చివర్లు చిట్లడటం తగ్గుతుంది.

 

తలస్నానం చేసినా జుట్టు జిడ్డుగా కనిపిస్తోందా. రెండు గుడ్ల పచ్చ సొనలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి బాగా కలిపి దీన్ని తలకు రాస్తే జిడ్డు వదిలి జుట్టు అందంగా మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: