ఉసిరి నూనెతో జుట్టు మెరిసిపోతుంది తెలుసా?

Durga Writes

ఉసిరికాయ.. తినడానికి పుల్లగా ఆరోగ్యానికి తోడుగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఈ ఉసిరికాయ అందానికి కూడా ఎంతో తోడు పడుతుంది. జుట్టు అందంగా మారడానికి ఉసిరికాయ తోడు ఎంతో ఉంటుంది. అయితే ఒక్క ఉసిరికాయే కాదు.. కొబ్బరి నూనె, బాదం నూనె కూడా ఎంతో ఉపాయాగపడుతాయి. అయితే ఎలాంటి జుట్టుకు ఏలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అందంగా తయారవుతుందో ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

జుట్టు పొడిబారి పీచులా తయారు అయితే కొబ్బరి నూనెను తలకు మర్దన చెయ్యండి.. ఆ తర్వాత తలకు ఆవిరి పట్టండి. చాలు జుట్టు అందంగా మృదువుగా తయారవుతుంది. అయితే జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి మరిగించి రాసుకుంటే జుట్టు తెలబడకుండా అందంగా తయారవుతుంది. 

 

బాదం నూనెను ఎప్పటికప్పుడు జుట్టుకు పట్టిస్తూ ఉంటె జుట్టు కుదుళ్ళు గట్టి పది అందంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే ఈ బాదం నూనె కారణంగా చుండ్రు తగ్గుతుంది.

 

దుమ్ము, దూళి, కాలుష్యం కారణంగా నిర్జీవంగా తయారైన జుట్టుకు ఉసిరి నూనె పట్టిస్తే పట్టులా మారుతుంది. ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాదు జుట్టు రాలే సమస్య కూడా బాగా తగ్గుతుంది. వారానికి ఒకసారి ఈ ఉసిరి నూనెను కొబ్బరి నూనెలో కలిపి పట్టిస్తే జుట్టు రాలే సమస్యలు అన్ని యిట్టె తగ్గిపోతాయి.. 

 

చూసారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ జుట్టును ఆరోగ్యంగా తయారు చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: