అందం: స్ట్రాబెర్రీస్‌తో అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్.. ఎలాగో తెలుసా..?

Kavya Nekkanti

స్ట్రాబెర్రీ.. చూడటానికి ఎంత అట్రాక్టివ్‌గా ఉంటుందో.. తింటే అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ టేస్టీ కలర్ ఫుల్ ఫ్రూట్ పిల్లలతో పాటు పెద్దలకు కూడా నోరూరిస్తుంది. స్ట్రాబెర్రీ టేస్ట్ మాత్రమే కాదు, చర్మ మరియు జుట్టు ఆరోగ్యానికి, అందానికి అద్భుతంగా సహాయపడుతుంది. బెర్రీస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ 'సి' వయసుపైబడినట్లు కనిపించకుండా చేస్తుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది. చర్మం డ్యామేజ్‌ కాకుండా నివారిస్తుంది. ఫైన్‌ లైన్స్‌, ముడుతలను నివారిస్తుంది.

 

స్ట్రాబెర్రీ డల్‌ గా, డ్రైగా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతంగా, కాంతివంతంగా మారుస్తుంది. స్ట్రాబెర్రీస్‌లో ఉండే లక్షణాలు చర్మంపై నల్ల మచ్చలు, గీతలను తొలగిస్తాయి. అందుకు ముందుగా స్ట్రాబెర్రీస్‌ తీసుకుని జ్యూస్‌ తియ్యాలి. దీన్ని ముఖం, మెడ మొత్తానికి అప్లై చేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి, వ్యాధినిరోధకశక్తి లోపించడం వల్ల ఏర్పడే చుండ్రును నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్ ను మెత్తగా చేసి, ఈ పేస్ట్ కు గుడ్డు మిక్స్ చేయాలి. అందులోనే కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి, జుట్టుకు అప్లై చేయాలి.

 

అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకొని మెత్తగా చేసి అందులో కార్న్ స్ట్రార్చ్ వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అర‌గంట‌ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేషియల్ మీ చర్మం చూడటానికి యంగ్‌గా మరియు బ్రైట్‌గా చేస్తుంది. కొన్ని స్ట్రాబెర్రీస్‌ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి నూనె, ఆలివ్‌ ఆయిల్‌, చక్కెర కలపాలి. వీటిని మొత్తగా పేస్ట్‌ చేసి, ముఖం, శరీరానికి అప్లై చేయాలి. ఇది చ‌ర్మంపై మృతకణాలను తొల‌గించి కాంతివంత‌గా చేస్తుంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: