పొట్ట రావడానికి ప్రధాన కారణం.. "ఆ ఒక్క విటమిన్" లోపమే...!!!

NCR

చాలా మందికి  పొట్ట ఎంతో అడ్డంగా మారుతుంది. చూడటానికి ఎంతో చక్కని ముఖంతో అందంగా ఉన్నాము  అనుకున్న వెంటనే కాస్త కిందకి చూస్తే కొండలాంటి పొట్ట కనపడే సరికి ఒక్క సారిగా  ఎంతటి అందం అయినా సరే ఆవిరి అయ్యిపోవాల్సిందే. అందుకే చాలా మంది పొట్ట రాకుండా ముందస్తు జాగ్రతలు తీసుకుంటారు. అయితే మరికొంత మంది జాగ్రత్తలు తీసుకున్నా కొవ్వు పదార్ధాలు తినకుండా ఉన్నా సరే పొట్ట వచ్చేస్తుంది. డానికి ప్రధాన కారణం శరీరంలో క్షీణించిన సి విటమిన్.

 

మన శరీరంలో సి విటమిన్ తక్కువగా ఉంటే బరువు తగ్గడం ఆగిపోతుందని అంటున్నారు వైద్యులు. అందుకే శరీరంలో సి విటమిన్ పూర్తిస్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవలాని అంటున్నారు. సి విటమిన్ ముఖ్యంగా పండ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ని పెంచడంలో కీలకంగా మారుతాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సి విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది.

 

అధిక బరువు ఉన్నవాళ్ళు లేదా బీర పొట్ట ఉంది ఎంతకీ తగ్గడంలేదని బాధపడే వాళ్ళు సి విటమిన్ ఉన్న పళ్ళు తింటే తప్పకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని తొలగించవచ్చు. అలాగే ఈ పండ్లని తినడంతో పాటు పొట్ట బరువు తగ్గించే వ్యాయామాలు చేయడం కూడా ఎంతో అవసరం. ఎప్పుడైతే శరీరంలో సి విటమిన్ తగ్గించే పొట్ట చుట్టూ రింగు లా కొవ్వు పేరుకుపోయి మీకు మీరే ఎంతో అసహ్యంగా కనిపిస్తారు. మరి సి విటమిన్ ఎక్కువగా దొరికే పళ్ళు ఒక్క సారి పరిశీలిస్తే – ఉసిరి, నారింజ, నిమ్మకాయ, కివి, టమాట, జామకాయ స్ట్రాబెర్రీ, మొలకలు, కాలీఫ్లవర్ లలో సి విటమిన్ అధికంగా దొరుకుంతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: