నల్లటి అందమైన జుట్టు కోసం ఇంటి చిట్కాలు..!

Durga Writes

జుట్టు.. అమ్మాయికైనా అబ్బాయికైనా జుట్టు వత్తుగా, నల్లగా మెరిసిపోతూ ఉండాలనుకుంటారు. నల్లగా పొడవుగా ఉండాలని ఆశిస్తారు. కానీ కొందరికి ఆ అదృష్టం ఉండదు. నల్లని జుట్టు కావాలనుకునే చాలామందికి జుట్టు కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు అయినా సరే ఫలితం ఉండదు. 

                                

తలకి రంగు వేసిన రెండు మూడు రోజుల్లోనే తెల్ల జుట్టు వచ్చి చిరాకు తెప్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు మీరు కోరుకునే నల్లటి జుట్టు మీ సొంతం అవుతుంది అని అంటున్నారు కొందరు నిపుణులు. ఆ చిట్కా ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                                

కరివేపాకు నూనె... 

 

ఒక కట్ట కరివేపాకుల్ని తీసుకుని శుభ్రం చేసి ఎండబెట్టాలి. ఆకులు ముదురు గోధుమ రంగుకి వచ్చాక మెత్తగా పొడి చేయాలి. నాలుగు టీస్పూన్ల కరివేపాకు పొడిని 200 మిల్లిలీటర్ల కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెలో వేసి రెండు నిమిషాలు వేడిచేయాలి. నూనె చల్లారాక వడకట్టి గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి. ఈ నూనెని వారానికి రెండుసార్లు తలకు పట్టించాలి. 

 

చేతి వేళ్లని గుండ్రంగా తిప్పుతూ మెల్లగా మర్దనా చేస్తే మాడులోకి నూనె ఇంకుతుంది. 40 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. క్రమంగా ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లబడే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ తరువాత జుట్టుకు ఆవిరి పడితే మాడు మీద రంధ్రాలు తెరుచుకుని నూనె బాగా లోపలికి ఇంకడానికి సాయపడుతుంది. ఫలితం త్వరగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: