మంగు పోవాలంటే ఇలా చేయండి .. వెంటనే పోతుంది!!

Durga Writes

ఎంతో అందంగా ఉంటారు.. అలాగే ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. కానీ తుఫాన్ లా జీవితంలోకి ఎంటర్ అవుతుంది మంగు. ఆ మంగు కాస్త ముక్కు మీద నుండి బుగ్గల వరుకు అంత వ్యాపిస్తుంది. అయితే ఈ మంగు తగ్గటానికి ఎంతో మంది డాక్టర్లను కలిసినప్పటికీ ఈ మంగు తగ్గదు.. 

 

అయితే ఈ మంగు శరీర తత్వాన్ని బట్టి బొబ్బలు, మొటిమలు వ్యాపించటం.. చర్మానికి తగిలిన గాయాలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు, పుట్టు మచ్చలు మొదలైన కారణాల వల్ల మంగు వస్తుంది. కొంతమందికి అయితే ఈ మంగు వంశపారంపర్యంగా, హార్లోన్లలో సమతుల్యత లోపించడం వల్ల ఈ మంగు వస్తుంది. 

 

ఆలా వచ్చిన ఈ మంగు ఎంత ప్రయత్నించినా సరే కాస్త కూడా తగ్గదు. అలాంటి సమయంలో ఈ చిట్కాలు పాటిస్తే మంగు యిట్టె తగ్గిపోతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే మచ్చలు తగ్గుముఖం పడుతాయి.

 

పచ్చి పసుపు, ఎర్రచందనం కలిపి పాలల్లో నూరి రాసిన మంగు మచ్చలు తగ్గి చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. 

 

జాజికాయను మేక పాలలో అరగదీసి రాయడం వల్ల కూడా మచ్చలు తగ్గుముఖం పడుతాయి. 

 

పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై ప్రతిరోజు రాస్తే కొద్ది రోజుల్లోనే మచ్చలు నలుపుదనం పోతుంది. 

 

నిమ్మరసంలో తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

 

టొమాటోల గుజ్జుతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటిలో కడగాలి. ఇలా చెయ్యడం వల్ల కూడా మచ్చలు అన్ని క్రమంగా తగ్గిపోతాయి. 

 

కలబంద గుజ్జు మచ్చలపై రాయడం వల్ల మచ్చలు తగ్గిపోతాయి. 

 

చూశారుగా మచ్చలు అన్ని క్రమంగా తగ్గిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం మచ్చలు తగ్గటానికి ఈ చిట్కాలను పాటించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: