ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా నానో కార్ నిజంగా ఓ విప్లవం అని చెప్పాలి. ఎందుకంటే కేవలం లక్ష రూపాయల బేసిక్ ధరలోనే కారు అందించటం అనేది ఓ సంచలనం. అయితే నానో కారుకు ఆదరణ లేక పోవటంతో దీనిని నిలిపివేసింది టాటా కంపెనీ.ఇప్పుడు మళ్లీ ఈ కార్ ని లాంఛ్ చేయాలని చూస్తుందని.. పూర్తి ఎలక్ట్రికల్ గా.. ఈవీగా తీసుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాటా నానో ఎలక్ట్రికల్ కారు..2024 సంవత్సరం చివరి నాటికి ఇండియన్ రోడ్డెక్కబోతున్నదని..దీని ధర, మైలేజ్, ఫీచర్స్, కారు మోడల్ ఇలా ఉన్నాయంటూ కొన్ని వార్తలు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతూ హల్ చల్ చేస్తున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ కార్ కి 17 kWh బ్యాటరీ ఉంటుంది.ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 220 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంకా R12 profile టైర్లు, 2 ఎయిర్ బ్యాగ్స్, 3.3 kW, AC చార్జర్, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు, ఫ్రంట్ పవర్ విండోస్ ఈ కార్ యొక్క ఫీచర్లు.ఇలాంటి డీసెంట్ ఫీచర్స్ తో నానో ఎలక్ట్రికల్ కారును లాంఛ్ చేస్తుంది టాటా. ఈ కార్ బేసిక్ ధర 5 లక్షల రూపాయలుగా ఉంటుందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాల సమాచారం తెలుస్తుంది. దీని హైఎండ్ ఫీచర్స్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా.ప్రస్తుతం టాటా టియాగో ఈవీ వెహికల్ స్టార్టింగ్ ధర 8 లక్షల నుంచి 11.50 లక్షల రూపాయల దాకా ఉంది.అయితే టాటా టియాగో ఈవీ కార్ల అమ్మకాల్లో మంచి రెస్పాన్స్ రావటంతో.. టియాగో రేంజ్ కంటే తక్కువగా.. 10 లక్షల రూపాయల లోపు ధరలో.. నానో ఎలక్ట్రికల్ కారు తీసుకురాబోతున్నట్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.ఇక ఎలక్ట్రికల్ చిన్న కార్ల రేంజ్ లో.. ప్రస్తుతం ఎంజీ ఎలక్ట్రికల్ కామెట్ కారు ఉంది. ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి 7 లక్షల నుంచి 10 లక్షల దాకా ఉంది. ఇప్పుడు ఈ రేంజ్ లో నానో కార్ ను తీసుకురావాలని టాటా కంపెనీ భావిస్తుంది. అయితే 2024లోనే నానో ఈవీ రోడ్డెక్కుతుందా లేదా అనేది చూడాలి..