ఎలుకలు కారులో ప్రవేశించకుండా ఈ టిప్స్ పాటించండి?

Purushottham Vinay
మనం వాడే కారును ఖచ్చితంగా శుభ్రంగా, భద్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇంకా అది కొంచెం కష్టం కూడా. పైగా వర్షాకాలంలో ఎలుకలు కారులో ప్రవేశించే  అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.దాని ఫలితంగా చెడు వాసన రావడంతో పాటు ఎలక్ట్రిక్‌ సహా విలువైన వస్తువులను ఎలుకలు తినేసే ఛాన్స్ కూడా ఉంటుంది.ఎలుకల వల్ల చాలా అవస్థలు పడుతున్నా కూడా వాటి నుంచి కారును ఎలా కాపాడుకోవాలో చాలా మంది కార్ యజమానులకు అవగాహన ఉండదు. కానీ ఎలుకల వల్ల చాలా నష్టం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఈ టిప్స్ పాటించి కారులోకి ఎలుకలు రాకుండా ఈజీగా నియంత్రించవచ్చు. కొన్ని రకాల మంచి క్వాలిటీ స్ప్రేలతో కారు లోపల ఎలుకలు సహా ఇతర కీటకాలు ప్రవేశించకుండా చూడవచ్చు. వివిధ రకాల ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఇలాంటి స్ప్రే లను మనం కొనుగోలు చేయవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ఎలుకల బాధ నుంచి మన కారును ఈజీగా కాపాడుకోవచ్చు.ఇక కారు లోపల ఎలుకలు పోకుండా ఉండేందుకు పొగాకు ఆకులు బాగా పనిచేస్తాయి.


అందువల్ల పొగాకు ఆకుల కట్టను ఇంజిన్‌ బే లేదా కారులోపల ఏదో ఒక చోట ఉంచాలి. కారు లోపల ఎలుకలు నివాసం ఉండకుండా పొగాకు ఆకులు చాలా బాగా పనిచేస్తాయని చాలా మంది వాహనదారులు తెలిపారు.మాములుగా ఎలుకలు చీకటి ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు బాగా ఇష్టపడతాయి. అంటే ఇంజిన్‌ బే లేదా చీకటి ప్రాంతాల్లో పార్క్‌ చేసిన కార్లలో ఉండేందుకు ఇవి ఇష్టపడతాయి. అవి పిల్లులు, గుడ్లగూబలు సహా ఇతర జంతువుల కంటికి కనిపించకుండా ఉంటామని భావిస్తాయి.అలాంటి పరిస్థితుల్లో చీకటి ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లను ఎలుకలు ఖచ్చితంగా ఎంచుకుంటాయి.అందువల్ల కార్లను ఎల్లప్పుడూ కూడా కొంచెం వెలుతురు ఉండే ప్రాంతాల్లో మాత్రమే పార్క్ చేయడం చాలా మంచిది.ఎలుకలు సహా ఇతర కీటకాలు ఆహార పదార్ధాలకు ఖచ్చితంగా ఆకర్షితం అవుతాయి. అందువల్ల కారులో ఎలాంటి ఆహార పదార్ధాలు విడిచి పెట్టకుండా చూసుకోవాలి. ఇంకా అలాగే కారు శుభ్రంగా ఉండేలా చూసుకుంటే ఎలుకలు ప్రవేశించే అవకాశం ఉండనే ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: