ఆటోమొబైల్ రంగంలో రాను రాను చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటినుంచో చలామణిలో ఉన్న ఇంధన వాహనాల స్థానాన్ని విద్యుత్ శ్రేణి వాహనాలు చాలా వేగంగా ఆక్రమించేస్తున్నాయి.మరీ ముఖ్యంగా టూ వీలర్ కంపెనీలు చాలా ఎక్కువ సంఖ్యలో తమ స్కూటర్లని బైక్ లను విద్యుత్ శ్రేణిలో లాంచ్ చేస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో లాంబ్రెట్టా స్కూటర్స్ కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు లాంబ్రెట్టా వీ 125(Lambretta V125). ఇక ఈ స్కూటర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.దీని స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే లాంబ్రెట్టా వీ125 ఎలక్ట్రిక్ స్కూటర్ ని మిలాన్ డిజైన్ వీక్ 2022లోనే ప్రదర్శించారు. ఈ స్కూటర్లో 125సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలెండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10 హార్స్ పవర్ 9.2 ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది.
ఈ స్కూటర్ రెండు చక్రాలకు కూడా డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇంకా అలాగే 12 వోల్ట్స్ చార్జర్ ఉంటుంది. మొత్తం మీది ఇది వెస్పా ఎల్ ఎక్స్ 125 స్కూటర్ కు పోటీగా ఇంకా అంతకు మించిన ఫీచర్లు, పనితీరుతో వినియోగదారులను ఎంతగానో అలరించనుంది.ఇంకా ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీనికి ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ ప్యానల్ ఉంది. ఎల్ఈడీ లైటింగ్ హెడ్ ల్యాంప్ ఇంకా అలాగే సిగ్నల్ లైట్లు కూడా ఎల్ఈడీనే ఉంటాయి. దీనికి డిజిటల్ స్పీడో మీటర్ ఉంటుంది.ఇంకా అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది.అలాగే లగేజీ స్టోరేజీ రెండు ప్రాంతాలు ఉంటాయి.ఇక ఈ స్కూటర్ ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడంటే.. లాంబ్రెట్టా వీ 125 ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 జూన్ నెలలో ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టే అవకాశం ఉంది. అయితే దీని ధరకు సంబంధిన వివరాలు ఇంకా తెలియలేదు.