Bgauss D15: 20 సేఫ్టీ ఫీచర్లు ఇంకా సూపర్ రేంజ్?

frame Bgauss D15: 20 సేఫ్టీ ఫీచర్లు ఇంకా సూపర్ రేంజ్?

Purushottham Vinay
అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ ఇంకా హై బ్యాటరీ రేంజ్ అలాగే ఫాస్ట్ యాక్సలెరేషన్ తో Bgauss D15 ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది.అందరికీ కూడా అందుబాటులో వుండే బడ్జెట్ లో హై ఎండ్ ఫీచర్లతో రైడర్లకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఈ స్కూటర్ అందిస్తోంది. అందువ్స్ ఈ బైక్  బుకింగ్స్ ఈమధ్య బాగా పెరిగాయి.చూడటానికి ఆకట్టుకునే స్పోర్టీ లుక్ ఉండే ఈ స్కూటర్  ఏకంగా 20 కంటే ఎక్కువగా సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది.ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ బిగాస్(Bgauss) ఇండియాలో తన మూడో ఎలక్ట్రిక్ స్కూటర్ బిగాస్ డీ15(Bigaus D15)ను ఇటీవల రిలీజ్ చేసింది. ఈ స్కూటర్‌లో లాంగ్ రేంజ్‌తో దాదాపు 2 డజన్ల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని లాంచింగ్ అప్పుడు కంపెనీ తెలిపింది. రెండు వేరియంట్లలో ఈ స్కూటర్ మనకు అందుబాటులో ఉంది.


బిగాస్ డీ15ఐ ఇంకా బిగాస్ డీ15 ప్రో. బిగాస్ డీ15ఐ ధర ధర 99,999(ఎక్స్ షోరూమ్) ఇంకా బిగాస్ డీ15 ప్రో ధర వచ్చేసి రూ. 1,14,999(ఎక్స్ షోరూమ్) గా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కస్టమర్‌లు ఈ బైక్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవడానికి కంపెనీ టోకెన్ మొత్తాన్ని కేవలం రూ.499గా నిర్ణయించింది.ఇక కంపెనీ స్కూటర్‌లో మొత్తం 3.2 kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఈ బ్యాటరీని కేవలం 5 గంటల 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీనిని కనుక మీరు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 115 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక అలాగే వేగానికి సంబంధించి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 7 సెకన్లలో ఏకంగా గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్ ని అందుకోగలదు. ఈ స్కూటర్‌లో, కంపెనీ రెండు రైడింగ్ మోడ్‌లను కూడా అందించింది. ఇక ఇందులో మొదటి మోడ్ ఎకో అలాగే రెండవది స్పోర్ట్ మోడ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: