రికార్డ్ సృష్టించిన మారుతి గ్రాండ్ సుజుకి విటారా?

Purushottham Vinay
ఇండియన్ మార్కెట్లో 'మారుతి సుజుకి' కంపెనీ  వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ SUV కార్స్ విభాగంలో దాదాపు 18 శాతం వాటాను కలిగి ఉంది.అయితే కంపెనీ ఇటీవల గ్రాండ్ విటారా అనే కొత్త SUV ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ SUV విడుదల కాకముందే దీనికున్న ఆదరణ ఇక అంతా ఇంతా కాదు, ఎందుకంటే ఆ స్థాయిలో బుకింగ్స్ పొందగలిగింది. ఇటీవల కంపెనీ డెలివరీలు కూడా స్టార్ట్ చేసింది.కంపెనీ గత నవరాత్రి ప్రారంభ సమయంలో సెప్టెంబర్ 26 న డెలివరీలను ప్రారంభించింది. అయితే డెలివరీలు ప్రారంభించిన మొదటి నెలలోనే మారుతి సుజుకి ఏకంగా 4,800 యూనిట్ల కార్లను డెలివరీ చేసి మంచి రికార్డ్ సృష్టించింది. అనుకున్నట్లుగానే బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు చేసేసింది.కంపెనీ ఈ SUV కార్ కోసం విడుదలకు ముందే బుకింగ్స్ స్వీకరించింది, ఆ తరువాత ధరలను కూడా అధికారికంగా ప్రకటించింది.


కంపెనీ ఈ SUV కార్ ధరలను వెల్లడించకముందే దాదాపు 40,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. మొత్తం మీద ఇప్పటికి ఆ బుకింగ్స్ సంఖ్య 60,000 దాటేసింది. ఇది పండుగ సమయంలో కంపెనీ సాధించిన అపూర్వభమైన రికార్డ్ అనే చెప్పాలి.గ్రాండ్ విటారాను మారుతి సుజుకి రూ. 10.45 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లక్షల ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఇది మొత్తం 10 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది, కావున టాప్ మోడల్ ధర రూ. 19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).ఇక ఈ మారుతి సుజుకి గ్రాండ్ విటారా మొత్తం 09 కలర్ లో అందుబాటులో ఉంది. ఇందులో ఆరు సింగిల్ టోన్ కలర్స్ కాగా, మిగిలిన నాలుగు డ్యూయెల్ టోన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అందువల్ల కస్టమర్స్ తమకు నచ్చిన వేరియంట్ ఇంకా నచ్చిన కలర్ లో ఎంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: