హ్యుందాయ్ కంపెనీ తన నాలుగో తరం Tucson ఎస్‌యూవీ ధరను రివీల్ చేసింది. ఇక రెండు ట్రిమ్ లెవల్స్‌లో ఈ కారు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వీటిలో బేస్ మోడల్ అయిన ప్లాటినం ట్రిమ్ ధర వచ్చేసి రూ.27.69 లక్షల నుంచి ప్రారంభం కానుంది.అయితే టాప్ ఎండ్ వేరియంట్ అయిన సిగ్నేచర్ ట్రిమ్ మోడల్ ధర తెలియరాలేదు. ఇంకా దీనికి సంబంధించిన బుకింగ్స్ గత నెల జులై 19వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి.ఇక ముందు వెర్షన్ కంటే మెరుగైన ఫీచర్లతో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో లెవల్ 2 ఏడీఏస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం) సహా మొత్తం 60కి పైగా కనెక్టివిటీ ఫీచర్లను కూడా కంపెనీ అందించింది. ఇక ఈ కారుకు ప్రధాన ఆకర్షణ ఇవే.హ్యుందాయ్ కొత్త Tucson కారును మనదేశంలో గత నెలలోనే రివీల్ చేసింది. అయితే అప్పుడు ధరను ప్రకటించలేదు. క్రెటా ఇంకా అల్కజార్‌లను మించే స్థాయిలో ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో లాంచ్ కానుంది. ఇంకా మనదేశంలో హ్యుందాయ్ విక్రయించే వెర్షన్‌లో పెద్ద వీల్ బేస్‌ను అందించనున్నారు.ఈ Tucson కొత్త తరం డిజైన్‌తో రానుంది. ఈ మోడల్‌లో 18 అంగుళాల అలోయ్ వీల్స్‌ను కూడా హ్యుందాయ్ కంపెనీ అందించింది.
10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ కార్ లో ఉంది. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఎన్నో లేటెస్ట్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు..పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు ఇంకా డ్యూయల్ టోన్ క్లైమెట్ కంట్రోల్, ఫుల్లీ డిజిటల్ డయల్స్, 360 డిగ్రీ కెమెరా, బోస్ ఆడియో సిస్టం అలాగే రెండో వరుస సీట్లకు రిక్లెయినర్ లాంటి టాప్ క్లాస్ ఫీచర్లను హ్యుండాయ్ లేటెస్ట్ ఎస్‌యూవీలో చూడవచ్చు.అలాగే ఏడీఏఎస్ లెవల్ 3 ఫీచర్లు ఉన్న మొట్టమొదటి హ్యుండాయ్ కారు ఇదే. ఇక ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే... కొత్త హ్యుందాయ్ Tucson ఎస్‌యూవీలో 2.0 లీటర్ డీజిల్ ఇంకా 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు ఉండనున్నాయి. ఈ రెండు ఇంజిన్లలో కూడా ఆటోమేటిక్ గేర్ బాక్స్ వెర్షన్లే ఉండనున్నాయి. ఏడబ్ల్యూడీ/టెర్రెయిన్ మోడ్స్ కూడా అందించనున్నారు.ఇక ఈ కారు అంతర్జాతీయ మార్కెట్లో 2020 సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది.