వాహనదారులకి బిగ్ షాక్ ఇచ్చిన అధికారులు?

Purushottham Vinay
ఇక మోటార్ వాహనాన్ని రోడ్డు పైకి తీసుకువచ్చిన సదరు మోటార్ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా మీ వద్ద ఉండటం చాలా అవసరం. సరైన పత్రాలు లేకుండా వాహనాన్ని నడపటం అనేది చట్టరీత్యా పెద్ద నేరం.కాగా ఇక గత రెండేళ్లుగా కరోనా తెచ్చిన పరిస్థితులు ఇంకా అలాగే లాక్‌డౌన్‌ల కారణంగా కొన్ని పత్రాలను రెన్యువల్స్ విషయంలో వాహన యజమానులకు మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ ప్రకటించిన విషయం మనకు తెలిసినదే. అయితే, ఇప్పుడు పరిస్థితులు అనేవి సాధారణ స్థితికి చేరుకోవడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా రోడ్డపైకి వస్తే, ఖచ్చితంగా జరిమానా విధిస్తున్నారు.ఇలా ఒక రాష్ట్రంలో కేవలం ఒక్క రోజులోనే దాదాపు ఏడు లక్షల రూపాయల జరిమానాలను విధించడం జరిగింది.


పూర్తి వివరాల్లోకి వెళితే, జార్ఖండ్‌ రాష్ట్రంలోని ట్రాఫిక్ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆకస్మిక వాహన చెకింగ్ లు నిర్వహించారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వివిధ ప్రాంతాలలో వీరు ఈ డ్రైవ్ నిర్వహించారు. ఇలా ఒక్క రోజులో మొత్తం 235 వాహనాలు సరైన పత్రాలు లేకుండా రోడ్డుపై తిరుగుతున్నట్లు వారు గుర్తించారు.ఇక మొత్తంగా ఆ రోజు రూ.6.95 లక్షల డబ్బుని జరిమానా రూపంలో వసూలు చేసినట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు.ఇక ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 65 వాణిజ్య వాహనాలతో పాటుగా మొత్తం 235 వాహనాలకు సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. అలాగే పన్ను చెల్లింపులో అవకతవకలు, అధిక లోడ్, కాలుష్య ధృవీకరణ లేకపోవడం తదితర కారణాలతో సదరు వాహనాలకు జరిమానా విధించారు. ఒక్కరోజులో మొత్తం రూ.6,92,765 జరిమానాలను వారు వసూలు చేశారు. ఇంకా అలాగే నిబంధనలు ఉల్లంఘించిన 3 వాణిజ్య వాహనాలను సీజ్ కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: