యమహా: మార్కెట్లోకి మళ్ళీ RX100?

Purushottham Vinay
ఈ న్యూస్ గురించి తెలిస్తే ఖచ్చితంగా యమహా అభిమానులు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే, ఈ జపనీస్ కంపెనీ తమ ఐకానిక్ మోటార్‌సైకిల్ అయిన యమహా ఆర్ఎక్స్100 (Yamaha RX100) ను తిరిగి భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు వివిధ రకాల సన్నాహాలు చేస్తోంది. ఈ యమహా ఆర్ఎక్స్100 మోటార్‌సైకిల్‌ గురించి మోటారిస్టులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక భారతదేశంలో జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థకు పునాదులను బలోపేతం చేసిన స్ట్రాంగ్ మోడళ్లలో ఆర్ఎక్స్100 బైక్ కూడా ఒకటి. నిజానికి, ఇప్పటికీ ఈ మోడల్‌కి చాలా బలమైన డిమాండ్ అనేది ఉంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ బైక్ అయితే లక్షల రూపాయల ధర పలుకుతుంది.ఇక ఇంతటి పాపులర్ ఐకానిక్ క్లాసిక్ మోటార్‌సైకిల్ ను యమహా తిరిగి ఇండియాలో విడుదల చేయాలని చూస్తోంది. ఈ మంచి విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇక ఒక ఇంటర్వ్యూలో, యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ ఈషిన్ చిహానా మాట్లాడుతూ 'RX100' మోనికర్‌ను ఇండియాలో తిరిగి తీసుకురావడానికి ఆయన తన ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత కాలుష్య ఉద్గార నిబంధనల కారణంగా ఈ మోడల్ ఇక టూ-స్ట్రోక్ ఇంజన్‌ని ఉపయోగించబోదని ఆయన స్పష్టం చేశారు.


ఇక ఈ యమహా ఆర్ఎక్స్100 మోటార్‌సైకిల్ 1990 కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని 2-స్ట్రోక్ ఇంజన్ చేసే రయ్ రయ్ శబ్ధం అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి చాలా ఇష్టం. అయితే, ఈ బైక్ ని ప్రస్తుత కాలుష్య ఉద్గార నిబంధనలకు అనుగుణంగా కనుక డిజైన్ చేస్తే, దాని ఇంజన్ మునుపటి లాంటి శబ్ధం అనేది చేయకపోవచ్చు. మరి వినియోగదారులు దీనిని ఎలా స్వీకరిస్తారో వెయిట్ చేసి చూడాలి. ఏదేమైనప్పటికీ,ఈ కొత్త తరం ఆర్ఎక్స్100 మార్కెట్లోకి రావాలంటే చాలానే సమయం అనేది పట్టవచ్చు.ఇక అంతేకాకుండా, 'RX100' మోనికర్‌ను అంత సులభంగా ఉపయోగించలేమని, ఎందుకంటే ఇది ఈ మోటార్‌సైకిల్ ఇమేజ్‌పై చాలా ప్రతికూల ప్రభావం చూపుతుందని కూడా ఈషిన్ చిహానా చెప్పారు. ప్రస్తుతం, యమహా కంపెనీ 2025 వరకు లాంచ్ చేయడానికి అనేక ఉత్పత్తులు క్యూలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో నెక్స్ట్ జనరేషన్ ఆర్ఎక్స్100 మోడల్ ని 2026 వ సంవత్సరంలో లేదా ఆ తర్వాత విడుదల చేయవచ్చని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: