ప్రత్యర్థులకు వణుకుపుట్టిస్తున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్!

Purushottham Vinay
భారతదేశంలో రోజురోజుకి కూడా కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. కావున ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ పోటీని కొన్ని కంపెనీలు అయితే తట్టుకోలేకపోతున్నాయి. అయితే ఈ క్రమంలో నిస్సాన్ కంపెనీ కూడా దాదాపు తన ఉనికిని కోల్పోతున్న సమయంలో ఒక అద్భుతమైన SUV కార్ ని విడుదల చేసింది. ఇక అదే 'నిస్సాన్ మ్యాగ్నైట్'.ఇక భారతీయ మార్కెట్లో నిస్సాన్ కంపెనీ మ్యాగ్నైట్ SUV ని విడుదల చేయడంతో దాని దశ తిరిగిపోయింది. ఈ SUV  కార్ యొక్క అద్భుతమైన డిజైన్ ఆధునిక ఫీచర్స్ అన్నీ కూడా కస్టమర్లను ఎంతగానో ఆకర్శించాయి. ఈ కారణంగానే మార్కెట్లో ఈ కార్ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లగలిగింది. అయితే ఇప్పటికి కంపెనీ ఈ SUV కోసం ఏకంగా ఒక లక్ష యూనిట్ల బుకింగ్స్ ని స్వీకరించగలిగింది. ఇక ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప ఘన విజయం అనే చెప్పాలి.ఇక నిస్సాన్ కంపెనీ తన లెజండరీ మాగ్నైట్ SUV ని 2020 డిసెంబర్ నెలలో భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో విడుదలైనప్పుడు, దీని ధర వచ్చేసి రూ. 4.99 లక్షలు ఉంది.


ఇక నిస్సాన్ మాగ్నైట్ అనేది కంపెనీ నుండి సబ్-4 మీటర్ల SUV, ఇది కియా సోనెట్, టాటా నెక్సాన్ ఇంకా మారుతి విటారా బ్రెజ్జా మరియు భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర కాంపాక్ట్ SUVలతో పోటీపడుతుంది.ఈ నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో విడుదలైనప్పుడు, దీని ధర వచ్చేసి రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ ధర వచ్చేసి రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. నిస్సాన్ మాగ్నైట్ టర్బో వేరియంట్‌ ధర వచ్చేసి రూ. 7.88 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టర్బో సివిటి ధర వచ్చేసి రూ. 8.86 లక్షల నుండి ప్రారంభమవుతుంది.ఇక దేశీయ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే SUV కార్ లలో ఒకటిగా నిలిచిన నిస్సాన్ మాగ్నైట్ చాలా ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతోంది. ఇది భారతీయ మార్కెట్లో కియా కంపెనీ యొక్క సోనెట్ ఇంకా టాటా నెక్సాన్ మరియు మారుతి విటారా బ్రెజ్జా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: