Bajaj Pulsar N160: కొత్త మోడల్, సూపర్ ఫీచర్స్!

Purushottham Vinay
ఇండియాలో టాప్ బైక్ కంపెనీగా దూసుకుపోతున్న బజాజ్ కంపెనీ తన ప్రసిద్ధ బైక్ పల్సర్ శ్రేణిని విస్తరిస్తోంది. ఈ నెలలో పల్సర్ కొత్త బైక్ N160 మోడల్‌ను విడుదల చేయనుంది. ఈసారి బజాజ్ కంపెనీ పనితీరుతో పాటు స్టైల్‌పై కూడా తన దృష్టి సారించింది.ఇక పాత లోపాలను కూడా సరిదిద్దుతూ అనేక మార్పులను చేసింది. 2001 వ సంవత్సరంలో ప్రారంభించిన పల్సర్ ఇప్పటికీ కూడా అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో ఒకటి. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా ఈ పల్సర్ 125 నిలిచింది.అలాగే మరోవైపు ఎగుమతి మార్కెట్ విషయానికి వస్తే పల్సర్-160, పల్సర్-180 ఇంకా అలాగే పల్సర్-200 ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.పల్సర్ బైక్ భారీ మోడళ్ల గురించి మాట్లాడుతూ కంపెనీ ఇప్పటివరకు కూడా F250 ఇంకా అలాగే N250 వంటి మోడళ్లను విడుదల చేసింది. అలాగే ఇప్పుడు పల్సర్ మరో కొత్త మోడల్ పల్సర్ బైక్ అయిన ఎన్160ని విడుదల చేయనుంది. జూన్ నెలాఖరులోగా బజాజ్ కంపెనీ ఈ మోడల్‌ను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఇక స్టైలింగ్ పరంగా చూసినట్లయితే కొత్త పల్సర్ 160.. N250ని పోలి ఉంటుంది. ఇక ఈ కొత్త బైక్ మోడల్‌లో కంపెనీ ఎలాంటి కొత్త మార్పులు చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ కొత్త మోడల్ ఫీచర్స్ విషయానికి వస్తే..ఈసారి కంపెనీ తన కొత్త పల్సర్ ఎన్250కి మంచి స్పోర్టీ లుక్‌ని ఇచ్చింది.అలాగే ఈ మోడల్‌లో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌ను కూడా బజాజ్ కంపెనీ అందిస్తుందని అంచనా.ఇంకా డిజైన్ మరింత అందంగా చేయడానికి LED DRLలను అందమైన ఆకృతిలో ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇంకా అలాగే లుక్స్ పరంగా కూడా ఈ బైక్ N250కి చాలా దగ్గరగా కనిపిస్తుంది.అలాగే బైక్‌లోని సీట్ డిజైన్ ఇంకా రియర్ వ్యూ మిర్రర్స్, గ్రాబ్ రెయిల్స్, స్వింగార్మ్ ఇంకా అలాగే టెయిల్ సెక్షన్ దాదాపుగా ఎన్250 రూపాన్ని పోలి ఉంటాయి.ఖచ్చితంగా కూడా ఈ స్పోర్ట్స్ బైక్స్ ని ఇష్టపడే యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే బజాజ్ కంపెనీకి ఈ సరికొత్త మోడల్ మరో ప్లస్ పాయింట్ గా ఖచ్చితంగా నిలుస్తుంది.కాబట్టి మంచి స్పోర్ట్స్ బైక్ కావాలనుకునేవారు ఖచ్చితంగా ఈ బైక్ ని ట్రై చెయ్యొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: