సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు ఇవి ఖచ్చితంగా చెక్ చెయ్యండి!

Purushottham Vinay
ఇక కొత్త కార్ల మాదిరిగానే సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్ కూడా చాలా వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా సెకండ్ హ్యాండ్ కార్లని కొనుగోలు చేయవచ్చు.చాలా సెకండ్ హ్యాండ్ కార్లు కూడా మంచి కండిషన్‌లోనే ఉంటాయి. అంతేకాకుండా మంచి ఫీచర్లతో సరసమైన ధరలో కూడా లభిస్తాయి. అయితే ఈ సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు కొన్ని అంశాలని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదంటే మోసం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇక వాటి గురించి తెలుసుకుందాం.కారు డాక్యుమెంట్లు చెక్ చేయండి.. ఇక సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు ఆ వాహనం పేపర్‌లను ఖచ్చితంగా తనిఖీ చేయండి. ఛాసిస్ ఇంకా ఇంజిన్ నంబర్‌లను చెక్ చేయండి. ఇన్సూరెన్స్‌ పత్రాలు మొదలైనవాటిని కూడా చాలా క్షణ్ణంగా పరిశీలించాలి. వీలైతే కారు ఫిల్టర్‌లు మొదలైనవాటిని కూడా మీరు చూడాల్సి ఉంటుంది.అలాగే కారు ఇంజిన్‌ను తనిఖీ చేయండి..కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దాని పెయింట్ ఇంకా అలాగే కండిషన్‌ మాత్రమే కాదు ఇంజిన్ పనితీరు కూడా చాలా ముఖ్యం. అందుకే కారు ఇంజిన్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరమైతే మెకానిక్ సహాయం కూడా మీరు తీసుకోవచ్చు.


బూట్ స్పేస్ ఇంకా బానెట్‌ను తనిఖీ చేయండి.కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కారు బూట్ స్పేస్ ఇంకా అలాగే బానెట్‌ను ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కారు ఏమైనా డ్యామేజ్‌ అయితే లోపల చూడటం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.టైర్ల పరిస్థితిని కూడా చెక్‌ చేయండి. అలాగే కారు టైర్లపై ఓ లుక్కేయండి. తరచుగా సెకండ్ హ్యాండ్ కార్లలో చాలా మంది సెకండ్‌ హ్యాండ్‌ టైర్లని కూడా అమర్చుతారు. ఎందుకంటే కొత్త టైర్ల కోసం దాదాపు 20 వేల రూపాయలను కూడా వెచ్చించాల్సి ఉంటుంది.అలాగే కొన్ని కిలోమీటర్ల వరకు డ్రైవ్‌ చేయండి. ఇక సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు అది పాత కారని అస్సలు మరిచిపోకండి. ఇంజిన్‌లో సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కారును కొన్ని కిలోమీటర్ల దూరం కూడా నడపడం ముఖ్యం. కారును 100 వేగంతో నడపాలని మీరు గుర్తుంచుకోండి. అప్పుడే ఏమైనా సమస్యలు ఉంటే ఈజీగా బయటపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: