షాకింగ్ : Bajaj CT100 బైక్ నిలిపివేత!

Purushottham Vinay
ఇండియాలో టూవీలర్ తయారీ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో (Bajaj Auto) చీపెస్ట్, పాపులర్ బైక్ అయిన సీటీ100 (Bajaj CT100) మోడల్‌ను ఆపేసింది.ఇక బజాజ్ ఆటో అందించిన బైక్స్‌లో ఈ బైక్ చాలా తక్కువ ధరకే లభించేది. ఈ బైక్ చాలా పాపులర్ కూడా అయింది. మొదటిసారి టూవీలర్ కొనాలనుకునేవారు బజాజ్ సీటీ100 కొనేందుకు చాలా ఆసక్తి చూపించేవారు.కొన్నాళ్ల క్రితం బజాజ్ ఆటో బజాజ్ సీటీ100 బైక్ అప్‌గ్రేడ్ మోడల్‌ను కూడా లాంచ్ చేసింది. లేటెస్ట్ ఫీచర్స్ ఇంకా కొత్త కలర్స్‌తో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది.అలాగే ప్రస్తుతం బజాజ్ సీటీ110ఎక్స్ మోడల్ అందుబాటులో ఉంది. దీంతో పాపులర్ బైక్ అయిన బజాజ్ సీటీ100 మోడల్ తయారీని పూర్తిగా నిలిపివేయడం జరిగింది.ఇక ప్రస్తుతం బజాజ్ సీటీ100 కొత్త బైక్ షోరూమ్‌లల్లో దొరకడం అంటే దాదాపు కష్టమే. డీలర్ల దగ్గర కూడా బుకింగ్స్‌ని నిలిపివేసింది. అలాగే బజాజ్ ఆటో వెబ్‌సైట్‌లో కూడా బజాజ్ సీటీ100 లిస్టింగ్‌ను తీసేసింది. ఇంకా వీటి తయారీని కూడా నిలిపివేసింది బజాజ్ ఆటో.అయితే సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఈ బైక్‌కి డిమాండ్ ఎక్కువగానే ఉంది.


ఇక హీరో స్ప్లెండర్ బైక్‌కి గట్టి పోటీ ఇచ్చిన బైక్ ఈ బజాజ్ సీటీ100. అలాగే బైక్ సెగ్మంట్‌లో బాగా పాపులర్ అయిన మోడల్ కూడా. అయితే ఈ బైక్‌ని నిలిపివేస్తున్నట్టుగా కంపెనీ నుంచి అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. మరి లేటెస్ట్ డిజైన్‌తో ఇంకా ఫీచర్స్‌తో బజాజ్ సీటీ100 మళ్లీ మార్కెట్లోకి వస్తుందా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.ఇక బజాజ్ సీటీ100 లాంఛ్ అయినప్పటి నుంచి తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉండేది. వీకీపీడియాలోని సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే బజాజ్ సీటీ100 మొదటి జనరేషన్ 2004 నుంచి 2006 దాకా రెండో జనరేషన్ 2015 నంచి 2019 దాకా ఇంకా మూడో జనరేషన్ 2020 నుంచి అందుబాటులో ఉంది. బీఎస్4 వేరియంట్ 2017లో ఇంకా బీఎస్6 వేరియంట్ 2020లో ఇంకా బజాజ్ సీటీ110ఎక్స్ 2021లో లాంఛైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: