సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో వస్తున్న కియా కారెన్స్!

Purushottham Vinay
దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ఇంకా డీజిల్ ధరల నేపథ్యంలో కొనుగోలుదారులు సరసమైన సిఎన్‌జి వాహనాలను కొనేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇంతకముందు సిఎన్‌జి వాహనాల తయారీలో అనుభవం లేని కంపెనీలు కూడా ఇప్పుడు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి వాహనాలను వినియోగదారులకు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇక తాజాగా, కొరియన్ కార్ బ్రాండ్ కియా ఇండియా (Kia India), ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎమ్‌పివి కియా కారెన్స్ (Kia Carens) లో ఓ సిఎన్‌జి వెర్షన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.ఇక కియా ఇండియా తమ కారెన్స్ ఎమ్‌పివి 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మోడల్‌ను బేస్ చేసుకొని, అందులో ఓ సిఎన్‌జి ట్యాంక్ అమర్చిన వాహనాన్ని ఇండియన్ రోడ్లపై టెస్ట్ చేస్తుంది. కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా కియా ఓ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన సిఎన్‌జి వాహనాన్ని టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ రెండింటిలో ఏది ముందుగా మార్కెట్లో రిలీజ్ అవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత అనేది లేదు.


ఇక ఏదేమైనప్పటికీ, కియా భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా టర్బో పెట్రోల్ ఇంజన్ ఇంకా అలాగే సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో సిఎన్‌జి పవర్డ్ కార్లను ప్రవేశపెట్టిన కంపెనీగా చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం, భారతదేశంలో ఏ ఇతర కంపెనీ కూడా టర్బో ఇంజన్ ఇంకా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌ను అందించడం లేదు. భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా తమ కార్లలో న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ ఇంకా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌ ని మాత్రమే అందిస్తోంది.కాబట్టి ఈ విషయంలో (టర్బో పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్) మాత్రం కియా కారెన్స్ లేదా కియా సోనెట్ సిఎన్‌జి మోడళ్లు మంచి మార్కులను కొట్టేస్తాయని చెప్పాలి. ఎందుకంటే, పూర్తిగా పెట్రోల్ ఇంధనంతో నడిచే కారుతో కనుక పోల్చుకుంటే, సిఎన్‌జి గ్యాస్ తో నడిచే ఇంజన్ తక్కువ పవర్ ఇంకా తక్కువ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందుకు ప్రధాన కారణం, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ లో జరిగే నెమ్మది దహన ప్రక్రియే.ఇక అందుకే, పెట్రోల్ కార్లు అందించిన పెర్ఫార్మెన్స్ (క్విక్ యాక్సిలరేషన్ ఇంకా స్పీడ్) సిఎన్‌జి కార్లు అందించలేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: