Honda City e HEV : హైబ్రిడ్ వేరియంట్ లాంచ్!

Purushottham Vinay
జపనీస్ కార్ బ్రాండ్ హోండా (Honda) ఇండియన్ మార్కెట్లో అమ్ముతున్న సిటీ సెడాన్‌లో ఓ కొత్త హైబ్రిడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ హైబ్రిడ్ వెర్షన్ v ఇంకా అలాగే ZX అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది.ఇక ఈ హైబ్రిడ్ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు హోండా కంపెనీ తెలిపింది. ఇక ఈ మేడ్ ఇన్ ఇండియా హోండా సిటీ ఇ-హెచ్ఈవి హైబ్రిడ్ కారు ధరలు కంపెనీ మే 2022 నెల ప్రారంభంలో వెల్లడించనుంది.అలాగే హైటెక్ పెర్ఫార్మెన్స్, అడ్వాన్స్డ్ సేఫ్టీ, ప్రీమయం డిజైన్ ఇంకా అలాగే కంఫర్ట్‌తో హోండా సిటి ఇ-హెచ్ఈవి హైబ్రిడ్ కారును తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.ఇక ఈ కొత్త హోండా సిటీ హైబ్రిడ్ కారులో, కంపెనీ స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను ఉపయోగించే i-MMD హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉపయోగించింది. ఇక ఈ హోండా సిటీ హైబ్రిడ్ 1.5 లీటర్ అట్కిన్సన్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ ఇంకా అలాగే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లుతో కలిసి గరిష్టంగా 109 బిహెచ్‌పి శక్తిని ఇంకా అలాగే 253 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.ఇక ఈ ఎలక్ట్రిక్ మోటార్లు కారు ముందు చక్రాలకు అమర్చబడి ఉంటాయి, ఇవి ఒకే ఫిక్స్‌డ్ రేషియో గేర్‌బాక్స్‌తో యాడ్ చేయబడి ఉంటాయి.


ఇంజిన్ eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేయబడి ఉంటుంది. ఇక హైబ్రిడ్ పవర్‌ట్రైన్ కారణంగా, కొత్త సిటీ ఇ-హెచ్ఈవి లీటరుకు 26.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని హోండా కంపెనీ పేర్కొంది. ఈ కారు మాక్సిమం గంటకు 176 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని కంపెనీ తెలిపింది.ఇక ఈ కార్ ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ తమ ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ హైబ్రిడ్ కారు టాప్-ఎండ్ వేరియంట్లలో అందించే అన్ని ఫీచర్లను కూడా ఇందులో అందించనుంది. అదనంగా, ఈ కార్ లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఇంకా అలాగే హోండా వెబ్‌లింక్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ట్వీక్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఇంకా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో సహా) ఇంకా అలెక్సా అండ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి మరెన్నో ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: