స్కోడా స్లావియాకు రికార్డు బుకింగ్స్!

Purushottham Vinay
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ అయిన స్కోడా ఆటో (Skoda Auto) గడచిన ఫిబ్రవరి నెలాఖరున భారత మార్కెట్లో రిలీజ్ చేసిన సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'స్కోడా స్లావియా' కార్ (Skoda Slavia) కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. సరసమైన ధరలు, అత్యుత్తమ ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్ ఇంకా అలాగే విభిన్న ఇంజన్ అండ్ గేర్‌బాక్స్ ఆప్షన్ల కారణంగా కస్టమర్లు ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. ఇక ఈ కారును మార్కెట్లో విడుదల చేసిన మొదటి నెలలో 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని స్కోడా కంపెనీ ప్రకటించడం జరిగింది.ఇక ఇండియన్ మార్కెట్లో స్కోడా స్లావియా సెడాన్ ధరలు రూ. 10.69 లక్షల నుండి రూ. 17.79 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉన్నాయి. స్కోడా స్లావియా (Skoda Slavia) సెడాన్ ఈ విభాగంలో మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz), హోండా సిటీ (Honda City), హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) ఇంకా అలాగే ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) వంటి మిడ్-సైజ్ సెడాన్లకు పోటీగా ఇంకా అలాగే ఒక చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.


ఇది ఈ విభాగంలోని పోటీదారులతో కనుక పోలిస్తే, సరికొత్త మోడల్ కావడంతో దీనికి డిమాండ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది.ఇక స్కోడా స్లావియా పట్ల ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించి కానీ లేదా అధీకృత స్కోడా డీలర్‌షిప్ ను సందర్శించి కూడా రూ.11,000 టోకెన్ అడ్వాన్స్ ని చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవ్చచు. స్కోడా స్లావియా మొత్తం మూడు ట్రిమ్ లలో (యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్) ఇంకా అలాగే 8 వేరియంట్లలో విడుదల చేశారు. ఇది 1.0 లీటర్ టిఎస్ఐ ఇంకా అలాగే 1.5 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ ఇంకా అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో మనకు అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: