కేవలం 4 రోజుల్లోనే 3 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు!

Purushottham Vinay
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత సంవత్సరం నవంబర్ నెల నుండి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఫిక్స్డ్ గా ఉన్నాయి. అయితే, ఈ రాష్ట్రాలలో ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తిరిగి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ ఇక భగ్గమంటున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే మూడు సార్లు ఇంధన ధరలు బాగా పెరిగాయి. ఇక ఈ మూడు రోజుల వ్యవధిలోనే పెట్రోల్ ధరలు రూ.2.40 పైసలు పెరిగడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో లీటరు పెట్రోల్ ధర రూ.150 కి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇక గడచిన మంగళవారం నాడు లీటరు పెట్రోల్ ఇంకా అలాగే డీజిల్ పై 80 పైసల చొప్పున ధరని పెంచడం జరిగింది. ఆ తర్వాత వెంటనే బుధవారం నాడు కూడా మరో 80 పైసల చొప్పున ధరని పెంచారు. తాజాగా ఇప్పుడు శుక్రవారం నాడు మరో 80 పైసల చొప్పున ధర పెంచడం జరిగింది. ఇలా కేవలం నాలుగు రోజుల వ్యవధిలో మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. దీంతో ఇంధన ధరలు లీటరుపై రూ.2.40 పైసల చొప్పున పెరిగడం జరిగింది.

ఇక ధర పెరుగుదల తర్వాత , తెలంగాణ రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర 110.91 ఇంకా లీటరు డీజిల్ ధర రూ.97.24 లకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే లీటరు పెట్రోల్ ధర రూ.112.37 ఇంకా అలాగే లీటరు డీజిల్ ధర రూ.98.36 లకు చేరుకుంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ. 97.81 ఇంకా లీటరు డీజిల్ ధర రూ.89.07 గా ఉంటే, ముంబై సిటీలో లీటరు పెట్రోల్ ధర రూ. 112.51 కాగా, లీటరు డీజిల్ ధర వచ్చేసి రూ. 96.70 లకు చేరుకుంది. గడచిన సంవత్సరం నవంబర్ నెల నుండి, ప్రభుత్వ యాజమాన్యంలోని రిఫైనింగ్ ఇంకా మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను సవరించకపోవడం కారణంగా, చమురు కంపెనీలు పెట్రోల్ ఇంకా డీజిల్‌పై దాదాపు 2.25 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 17,000 కోట్లు) నష్టాన్ని చవిచూసినట్లు నివేదికలో తెలిసింది. ఇక ఇప్పుడు ఆ నష్టాన్ని రికవరీ చేసేందుకు ఆయిల్ కంపెనీలు ధరల బాదుడుకు రెడీ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: