మారుతీ సుజుకి నుంచి సెలెరియో CNG వెర్షన్..

Purushottham Vinay
మారుతి సుజుకి సోమవారం అప్డేట్ చేసిన సెలెరియో cng వెర్షన్‌ను విడుదల చేసింది, ఇది గత సంవత్సరం నవంబర్‌లో భారతదేశంలో అనేక అప్డేట్స్ తో ఇంట్రడ్యూస్ చేయబడింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియంట్ కారుగా పేర్కొనబడిన మారుతి సెలెరియో ఇప్పుడు cng తక్షణమే అందుబాటులో ఉన్న కొనుగోలుదారులను ఆకర్షించాలని చూస్తోంది.గత ఐదేళ్లలో తన cng వాహన అమ్మకాలలో 22 శాతం CAGR వృద్ధిని సాధించినట్లు మారుతి సుజుకి పేర్కొంది.ఇక మారుతీ సుజుకి ఈ cng కార్లను అందించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. "మేము రోడ్డుపై ఎనిమిది గ్రీన్ మోడల్‌ల అతిపెద్ద పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నాము. ఇంకా దాదాపు 9,50,000 S-CNG కార్లను అమ్మాము" అని మారుతీ సుజుకి మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. "ఆల్-న్యూ సెలెరియో S- లాంచ్ భారతదేశంలో గ్రీన్ వెహికల్స్ ని పెద్దఎత్తున రిసీవ్ చేసుకోడానికి ఇంకా అలాగే మా ఆశయానికి ఈ cng కార్ మమ్మల్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళుతుంది." అని అన్నారు.
ఇక ఈ ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ cng వేరియంట్ పెట్రోల్ మోడల్‌లో ఉన్న అదే డిజైన్ ఇంకా ఫీచర్లతో వస్తుంది. కంపెనీ కారుకు cng ట్యాంక్‌ను అమర్చడం మాత్రమే మార్పు. ఇది 60-లీటర్ సామర్థ్యం గల cng ట్యాంక్‌తో యాడ్ చేయబడిన 1.0-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్ VVT K-సిరీస్ ఇంజిన్ నుండి పవర్ ని పొందుతుంది. సెలెరియో సిఎన్‌జి కిలోకు 35.60 కిమీల మైలేజీని ఇస్తున్నట్లు మారుతి సుజుకి కంపెనీ తెలిపింది.1 Nm టార్క్ పెట్రోల్-మాత్రమే వేరియంట్‌లో ఆఫర్‌లో ఉన్న 89 Nm కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. పవర్ కూడా 56 Nm vis-a-vis 64 hp వద్ద కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ సెలెరియో cng దాని తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో వస్తుంది. ఇక మీలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్ 26.68 kmpl, cng వేరియంట్ 35.60 kmpl అందిస్తుంది.సెలెరియో cng ధర ₹6.58 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది టాటా టియాగో సిఎన్‌జి, శాంత్రో వంటి కార్లతో పోటీపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: