MG Astor లేటెస్ట్ ఫీచర్స్ & టెక్నాలజీ..

Purushottham Vinay
ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ కంపెనీ MG Motor. MG Motor ఇప్పటికే MG Hector ఇంకా MG ZS EV వంటి కార్లని విడుదల చేసి ఇండియన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకుంది. అయితే ఈ కంపెనీ ఇటీవల కొత్త MG Astor SUV కార్ ని ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించడం జరిగింది.ఇక ఈ కొత్త ఆస్టర్లో సరికొత్త ఫీచర్స్ ఇంకా పరికరాలతో పాటు సరికొత్త టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది.ఇక ఇటీవల సరికొత్త MG Astor SUV కార్ ని చూడటానికి ఒక MG డీలర్‌షిప్‌కు ఆహ్వానించడం జరిగింది. ఈ కొత్త SUV కార్ లోని ఫీచర్స్ ఇంకా అలాగే ఇందులోని టెక్నాలజీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కారు గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకోండి.ఇక ఇండియా మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ కొత్త MG Astor బ్రాండ్ MG ZS EV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది మొత్తం ఐదు కలర్స్ లో మనకు అందుబాటులో ఉంటుంది.

ఇక ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే దీని ముందు భాగంలో హాక్-ఐ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ అని పిలిచే ఒక అందమైన ఎల్ఈడీ హెడ్‌లైట్ క్లస్టర్‌ కూడా ఉంటుంది. ఈ SUV కార్ ఆకర్షణీయమైన భాగాలలో ఒకటి ఇందులోని గ్రిల్ అని చెప్పాలి.ఈ కార్ లో ఫ్రంట్ పార్కింగ్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మొత్తం 360-డిగ్రీ కెమెరా ఫంక్షన్‌లో ఒక భాగం.ఇక వెనుక భాగంలో ADR సిస్టంలో భాగమైన IRVM వెనుక భాగంలో కూడా ఒక కెమెరా అనేది ఉంది.అది గ్రిల్ కింద భాగంలో, కంపెనీ IRVM వెనుక ఉన్న కెమెరా రాడార్ సిస్టం అనేది అమర్చబడి ఉంటుంది. ఇది SUV కార్ ని లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఇంకా యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటానికి బాగా అనుమతిస్తుంది.ఇక MG Astor లో హాలోజన్ బల్బ్-పవర్డ్ ఫాగ్ లైట్లు ఉండే స్పోర్టీ బంపర్ కూడా లభిస్తుంది. అదే ఫాగ్ లైట్లు  కార్నింగ్ లైట్‌లుగా కూడా పనిచేస్తాయి. ఇక అలాగే ఫాగ్‌లైట్ల హౌసింగ్ గ్లోస్ బ్లాక్‌లో ఫినిషింగ్ ఉంటుంది. బయట భాగంలో తక్కువ క్రోమ్ అనేది ఉంటుంది. ఇంకా అది గ్రిల్ చుట్టూ కూడా బ్రష్డ్ అల్యూమినియంలో అలంకరించబడి ఉటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: