కారుకి వీల్ ఎలైన్మెంట్ ఎంత మంచిదో తెలుసా?

Purushottham Vinay
కారు సక్రమంగా పనిచేయాలంటే దానిలో పవర్ ఫుల్ ఇంజన్ ఉండటం అనేది ఎంత అవసరమో, ఇక అందులో చక్రాలు ఇంకా టైర్లు కూడా అంతే ఆరోగ్యకరంగా ఉండటం కూడా అవసరం. సాధారణంగా కార్లలో వీల్ అలైన్‌మెంట్ అనేది ఎంతో కీలకమైన అంశం. ఇక అందుకే కారుని అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై నిత్యం ఉపయోగిస్తుండటం వలన కార్లలో వీల్ అలైన్‌మెంట్ అనేది బాగా దెబ్బ తింటుంది.ఇక కార్లలో వీల్ అలైన్‌మెంట్ అనేది సరిగ్గా లేకపోవటం వలన కార్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఇక ఈ సమస్య వలన కొన్ని ఊహించని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం చాలానే ఉంది. కాబట్టి కార్లకు క్రమం తప్పకుండా వీల్ అలైన్‌మెంట్ చేయింటడం చాలా మంచిది.ఇక సాధారణంగా, మనం మెకానిక్ షాపుల దగ్గరకు వెళ్లినప్పుడు వీల్ అలైన్‌మెంట్ అనే పదం ఎప్పుడూ వింటూ ఉంటాం. వాస్తవానికి కొంత మంది కొత్తగా కారు కొనేవారికి వీల్ అలైన్‌మెంట్ అనేది ఏంటో తెలియకపోవచ్చు.

ఇక అసలు వీల్ అలైన్‌మెంట్ అంటే ఏంటి?ఎందుకు అది అంత అవసరమైనది? అనేది ఇప్పుడు తెలుసుకోండి.ఇక వీల్ అలైన్‌మెంట్ గురించి సులభంగా చెప్పాలంటే, మీ కారులోని అన్ని 4 చక్రాలు ఇంకా టైర్లు సరిగ్గా ఒకే దిశలో తిరిగేలా చేయడమే ఈ వీల్ ఎలైన్మెంట్ ప్రధాన లక్షణం. కారు గనుక ఎక్కువగా గతుకుల రోడ్లపై ప్రయాణించినప్పుడు లేదా పాట్ హోల్స్ మీద వేగంగా వెళ్లినప్పుడు ఆ కారులో వీల్ అలైన్‌మెంట్ అనేది పూర్తిగా పాడై పోవచ్చు.మీ కారు వీల్ అలైన్మెంట్ సరిగ్గా ఉన్నట్లయితే, అవి ఇంధనాన్ని ఆదా చేయటంలో ఎంతగానో సహకరిస్తాయి. వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోతే, చక్రాలు ఇంకా టైర్లు చాలా సులువుగా దొర్లడం అనేది ఎంతో కష్టతరంగా ఉంటుంది.ఇందువలన, వీటిని భారంగా ముందు నెట్టడానికి ఇంజన్ నుండి ఎక్కువ శక్తితో పాటు ఇంకా టార్క్ అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది.అందువల్ల ఇంధనం కూడా బాగా మండటం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: