టాటా టిగోర్ ఈవి బుకింగ్స్ ఓపెన్.. ఎప్పుడంటే..?

Purushottham Vinay
ప్రముఖ ఇండియా ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఈనెల 18వ తేదీన తమ కొత్త టిగోర్ ఈవి ని ఆవిష్కరించిన విషయం తెలిసినదే.ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు కంపెనీ బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించడం జరిగింది. ఇక ఆసక్తిగల కస్టమర్లు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకోవచ్చు.ఇక ప్రస్తుతం టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ కారును ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో మాత్రమే అమ్ముతుంది.ఇక ఇప్పటి వరకు ఈ కంపెనీ తమ కొత్త టిగోర్ ఈవి ధరను ఇంకా వెల్లడించలేదు.ఇక తాజా సమాచారం ప్రకారం..ఆగష్టు 31వ తేదీన కంపెనీ ఈ కారును మార్కెట్లో విడుదల చేసే సందర్భంగా, దీని ధర ఇంకా కారుకి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.ఇక రాబోయే 2025 సంవత్సరం నాటికి దేశంలో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది.

ఇక ఇందులో భాగంగానే, కంపెనీ తమ కొత్త టిగోర్ ఈవి ని మార్కెట్‌కు పరిచయం చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం టాటా కంపెనీ ఇండియా మార్కెట్లో రెండు పూర్తి ఎలక్ట్రిక్ మోడళ్లను అమ్ముతుంది. ఇక అవి ఒకటి నెక్సన్ ఈవి ఇంకోటి టిగోర్ ఈవి.ఈ కొత్త టిగోర్ ఈవి ని కంపెనీ రేంజ్ ఇంకా చార్జింగ్ వంటి అంశాల పరంగానే కాకుండా, దీని డిజైన్ పరంగా కూడా అప్‌గ్రేడ్ చేయడం జరిగింది.టాటా కంపెనీ ఇందులో ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఇంకా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌లను కూడా ఇందులో జోడించడం జరిగింది.ఇక ఇవే కాకుండా, అల్లాయ్ వీల్స్‌పై ఇంకా ఎక్స్టీరియర్‌లోని మరిన్ని కొన్ని ప్రాంతాల్లో బ్లూ కలర్ డీటేలింగ్స్‌ను ఇవ్వడం జరిగింది. ఇక ఇవన్నీ ఈ కారును ఎలక్ట్రిక్ కారుగా చూపించడంలో ఎంతగానో సహకరిస్తాయి.ఇక అలాగే ఇంటీరియర్స్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే.. ఇక ఈ సూపర్ కారులో కంపెనీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అండించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: