జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బెంజ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన కార్లతో ప్రపంచం మొత్తం కొన్ని కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుంది. ఇక గత సంవత్సరం చివర్లో ఇండియా మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ధరను కంపెనీ భారీగా పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ కారు ధర వచ్చేసి రూ.4.7 లక్షలు పెరిగి రూ.1.04 కోట్లకు (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది.ఇక గత సంవత్సరం చివర్లో ఈ కారును రూ.99.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) పరిచయ ప్రారంభ ధరతో విడుదల చేయడం జరిగింది. కాని ఇప్పుడు ఆ పరిచయ ధరలు ముగిసాయని ఇక అందుకే ఈ కొత్త ధరలు వర్తిస్తాయని బెంజ్ కంపెనీ తెలిపడం జరిగింది. ఇక ఈ సంవత్సరం జనవరి నెలలోనే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి మొదటి బ్యాచ్ అమ్మకాలు పూర్తయినట్లు బెంజ్ కంపెనీ ప్రకటించింది.ఇక ఇప్పుడు సెప్టెంబర్ 2021 నాటికి రెండవ బ్యాచ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ఇండియాకు తీసుకురావడానికి బెంజ్ కంపెనీ సన్నద్ధమవుతోంది.
ఇక ఇందుకోసం గడచిన మార్చి నెల నుండే కంపెనీ బుకింగ్‌లను బాగా స్వీకరిస్తోంది.ఇక మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ కారును పూర్తిగా ఫారెన్ కంట్రీల్లో తయారు చేసి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా ఇక్కడికి దిగుమతి చేసుకుని అమ్ముతూ వున్నారు.ఇక అధిక దిగుమతి సుంఖాల కారణంగా ఈ బెంజ్ కారు ధర కూడా చాలా అధికంగా ఉంటుందట.ఇండియా మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ ని ప్రారంభించిన సమయంలో ఇది మార్కెట్ నుండి అద్భుతమైన స్పందనను అందుకోవడం జరిగింది. ఇక ఈ మోడల్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బెంజ్ కంపెనీ మరో బ్యాచ్ ఎస్‌యూవీలను ఇండియాకు తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది.ఇక మొదటి బ్యాచ్‌లో భాగంగా కంపెనీ 50 యూనిట్లను పూర్తిగా అమ్మడం జరిగింది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బెంజ్ కార్లన్నీ కూడా ఇండియా మార్కెట్లో విడుదల కావటానికి ముందే పూర్తిగా అమ్ముడైపోయాయి. కాగా రెండవ బ్యాచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ల డెలివరీలు సెప్టెంబర్ 2021లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారట.