తిరిగి మార్కెట్లోకి రాబోతున్న బజాజ్ కాలిబర్..

Purushottham Vinay
మీకు హుడిబాబా బైక్ గుర్తుందా..? ఈ జెనరేషన్ కుర్రాళ్లకు దీని గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990 దశాబ్దానికి చెందిన కుర్రకారుకి మాత్రం ఇది పిచ్చి పిచ్చిగా కిర్రెక్కించే బైక్.ఇక ఆ బైకే బజాజ్ కాలిబర్. అప్పట్లో టెలివిజన్ ఇంకా రేడియాలలో ఈ హుడిబాబా అడ్వర్టైజ్‌మెంట్ వింటుంటే, అప్పుడు అదొక తెలియని సంతోషం ఇంకా వింత అనుభూతి కలిగేది.అప్పటి కుర్రకారుకి బజాజ్ కాలిబర్ బైక్ అంటే ఒక ఎమోషన్స్ అని చెప్పాలి. ఇక కాలిబర్ బైక్ ఇప్పటి ప్రీమియం బైక్‌లతో సమానం అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది గంటకు 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పోతుంది. ఇక లీటరు పెట్రోల్‌కి 90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.ఇంకా 115 సీసీ ఇంజన్ అలాగే 9.5 బిహెచ్‌పి పవర్ కలిగి ఉంటుంది. ఇక ఇవన్నీ బజాజ్ కాలిబర్ మోటార్‌ సైకిల్ యొక్క ప్రత్యేకతలు.బజాజ్ ఆటో ఇంకా కవాసకి సంస్థలు 1990 కాలంలో భాగస్వాములుగా ఉండేవి. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యం నుండి మార్కెట్లోకి అనేక ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు ఇంకా స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిలో బాగా పాపులర్ అయినది బజాజ్ కాలిబర్ లేదా కవాసకి కాలిబర్ అనే చెప్పాలి.

ఇక బజాజ్ ఆటో 1998 సంవత్సరంలో కాలిబర్ బైక్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది ఇంకా ఆ సమయంలో ఇది యువతను చాలా బాగా ఆకట్టుకుంది. ఇక వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చిన 'హుడిబాబా' ప్రకటనలు ఈ మోడల్ అమ్మకాలపై అప్పట్లో గొప్ప ప్రభావాన్ని చూపాయి.ఇక బజాజ్ ఆటో ఇప్పుడు తిరిగి కాలిబర్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఇక బజాజ్ ఆటో నుండి రాబోయే మరొక కొత్త ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ కోసం ఈ పేరును ఉపయోగించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక ఈ క్రమంలో బజాజ్ ఆటో 'కాలిబర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు కూడా చేసుకుంది. బజాజ్ కంపెనీ నుండి రాబోయే ఈ సరి కొత్త బైక్ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌ సైకిల్ విభాగంలో పోటీని మరింత కఠినతరం చేస్తుందని ఇప్పుడు ఈ విభాగంలో ఆదిపత్యం చలాయిస్తున్న హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: