సోలార్ పవర్ తో ఎలక్ట్రిక్ సైకిల్...

Purushottham Vinay
ఇండియాలో ఇక పెట్రోల్ ధరలు అనేవి అమాంతం పెరిగిపోతున్నాయని తెలిసిన విషయమే. అందుకే ఈ క్రమంలో దేశవ్యాప్తంగా చాలా మంది జనాలు ఇంకా వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఇష్టం చూపుతున్నారు.అందుకే ఈ కారణంగా ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకి బాగా పెరిగిపోతోంది. ఇక ఇదిలా ఉటే కొంతమంది అయితే తమ టాలెంట్ తో ఇంకా ఆలోచనలతో కొత్త కొత్త వాహనాలను తయారు చేస్తున్నారు.ఇక ఇటీవల కాలంలో కెఎల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు వైర్‌లెస్ ఛార్జింగ్ తో పనిచేసే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని తయారు చేయడం జరిగింది. ఇక మళ్ళీ ఇప్పుడు తమిళనాడులో ఇలాంటి ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.ఇక దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి..సమాచారం ప్రకారం, తమిళనాడులోని మదురైకి చెందిన ఓ కాలేజీ  స్టూడెంట్ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ని తయారు చెయ్యడం జరిగింది. ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రత్యేకత  విషయానికి వస్తే..ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మంచి సోలార్ పవర్ తో నడుస్తుందట.
మదురైలోని ఓ కాలేజీలో చదువుతున్న ఈ విద్యార్థి పేరు 'ధనుష్ కుమార్'. ఇక ఈ మదురై కళాశాల విద్యార్థి ధనుష్ కుమార్ సోలార్ పవర్ తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్‌ను రూపొందించడం పట్ల ఆ కాలేజ్ యాజమాన్యం చాలా హ్యాపీగా ఉందట. ఇక ఈ సైకిల్ సోలార్ ప్లేట్స్ సహాయంతో 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.సైకిల్ ఛార్జ్ తగ్గిన తర్వాత కూడా దాదాపు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించగలదట.ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ బ్యాటరీ కోసం ఉపయోగించే విద్యుత్ ఖర్చు పెట్రోల్ ధర కంటే చాలా తక్కువట. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ 50 కిలోమీటర్ల ప్రయాణించడానికి కేవలం రూ. 1.50 ఖర్చవుతుందని తెలిపారు. అలాగే ఈ ఈ-సైకిల్ వేగం విషయానికి వస్తే ఇది 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: