మహీంద్రా నుంచి కొత్త ట్రక్.. వివరాలు..

Purushottham Vinay
ఇండియా మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటవల తన కమర్షియల్ విభాగంలో ఒక కొత్త వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వారు లాంచ్ చేసిన ఈ వెహికల్ సుప్రో ప్రాఫిట్ మినీ ట్రక్.ఇక దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త మినీ ట్రక్కును సుప్రో ప్రాఫిట్ మినీ ఇంకా సుప్రో ప్రాఫిట్ మ్యాక్సీ అనే రెండు వేరియంట్లలో అమ్మనుంది.ఇక ఈ మినీ ట్రక్ ప్రారంభ ధర రూ. 5.40 లక్షలు కాగా,మాక్సి మోడల్ హై-ఎండ్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 6.22 లక్షల వరకు ఉంటుంది.ఇక ఈ కొత్త కమర్షియల్ వెహికల్, సుప్రో మినీ ట్రక్ ఆధారంగా తయారుచేయబడింది. సుప్రో ప్రాఫిట్ ట్రక్ హై లోడింగ్, అధిక మైలేజ్, అధిక సామర్థ్యం ఇంకా వివిధ లక్షణాలతో అభివృద్ధి చేయబడింది.ఇక ఈ మినీ ట్రక్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ కస్టమర్లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.మహీంద్రా కంపెనీ పవర్‌ఫుల్ డైరెక్ట్ ఇంజెక్షన్ బిఎస్ 6 డీజిల్ ఇంజిన్‌కు సుప్రో ప్రాఫిట్ మినీ ట్రక్ లో అమర్చడం జరిగింది. ఇక ఈ ఇంజన్ 3,600 ఆర్‌పిఎమ్ వద్ద 19.4 కిలోవాట్ల శక్తి కలిగి ఉంది. సుప్రో ప్రాఫిట్ మాక్సిలో 4 స్ట్రోక్ ఇంకా 2 సిలిండర్ 909 సిసి ఇంజన్ ను అమర్చారు.ఇక ఈ ట్రక్ 26 బిహెచ్‌పి పవర్ అలాగే 55 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇక ఈ ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో గరిష్ట సామర్థ్యాన్ని ఇస్తుంది.ఈ కొత్త ట్రక్కుకు పవర్ అలాగే ఎకో అనే రెండు మోడ్‌లు లభిస్తాయి. ఈ వెహికల్ లీటరుకు 23.30 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. సుప్రో ప్రాఫిట్ ట్రక్ మినీని సిఎన్‌జితో కూడా అమ్ముతారు.ఇక ఈ కొత్త కమర్షియల్ వెహికల్ ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించడానికి మహీంద్రా ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించడం జరిగింది.ఇక ఇందులో భాగంగా 12.99% వడ్డీ రేటుతో ఐదేళ్ల లోన్ స్కీమ్ వంటివి అందించడం జరిగింది.ఇక అంతేకాకుండా ఈఎమ్ఐ స్కీమ్ కింద,వాహన కస్టమర్లకు అదనపు ప్రత్యేక ఆఫర్‌గా 100% క్రెడిట్‌ను అందించాలని కంపెనీ ఆలోచిస్తుంది.ఇక సుప్రో ప్రాఫిట్ ట్రక్కులో 13 అంగుళాల టైర్ కూడా ఉంది.ఇక ఈ టైర్‌ను సమీకరించిన తరువాత, ట్రక్ ఎత్తు 170 మిమీ వరకు ఉంటుంది. ఈ మినీ ట్రక్ ఏ రకమైన రహదారిలో అయినా సరే ప్రయాణించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఇక అంతేకాకుండా ఇది 1,050 కిలోల బరువును కూడా మోయగల శక్తి కలిగి ఉంటుంది. కావున చాలామంది కమర్షియల్ కస్టమర్లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: