మళ్ళీ ధరలు పెంచిన టాటా..

Purushottham Vinay
ఫేమస్ ఇండియా ఆటోమొబైల్ కంపెనీ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో మంచి కార్ల సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో మంచి కార్లని అందిస్తుంది. మోటార్స్ తమ ప్యాసింజర్ కార్ల ధరలను మరోసారి పెంచడం జరిగింది.ఇండియాలో టాటా మోటార్స్ అమ్ముతున్న తమ 'న్యూ ఫరెవర్' రేంజ్ కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారిక ప్రతినిధి ఒకరు వెల్లడించడం జరిగింది.ఇక టాటా మోటార్స్ ఈ సంవత్సరం ఆరంభంలో తమ కార్ల ధరలను మొదటిసారిగా పెంచగా, ఈ సంవత్సరం మే నెలలో రెండవసారి పెంచింది. కాగా, ఇప్పుడు కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడం ఈ సంవత్సరంలో ఇది మూడవసారి.కొన్ని నెలల ముందు టాటా మోటార్స్ మోడల్ ఇంకా వేరియంట్‌ను బట్టి తమ ప్యాసింజర్ కార్ల ధరలను రూ.28,000 వరకు పెంచింది. కాగా ఇప్పుడు, కంపెనీ మళ్లీ తమ కార్ల ధరలను పెంచింది. 

ఇన్పుట్ వ్యయం పెరగడం వల్ల కార్ల ధరలను పెంచాల్సి వచ్చిందని టాటా మోటార్స్ తెలిపడం జరిగింది.ఇండియాలో పొల్యూషన్ కంట్రోల్ నిబంధనల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయాల (బిఎస్6 నిబంధనల) కారణంగా పల్లాడియం ఇంకా ప్లాటినం వంటి అరుదైన లోహాలకు డిమాండ్ బాగా పెరిగింది. కార్లలో ఉద్గారాలను తగ్గించడానికి ఎగ్జాస్ట్ ఉత్ప్రేరకంలో ఈ లోహాలను ఎక్కువగా వాడుతుంటారు.ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ గతేడాది జూన్  అమ్మకాల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది జూన్ నెలలో కంపెనీ అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. జూన్ 2020 వ సంవత్సరంలో టాటా మోటార్స్ కేవలం 11,419 యూనిట్లను మాత్రమే అమ్మగా, జూన్ 2021లో 24,110 యూనిట్లను అమ్మింది.ఇక టాటా మోటార్స్ తాజాగా తమ పాపులర్ ఆల్ట్రోజ్, నెక్సాన్, నెక్సాన్ ఈవీ ఇంకా హారియర్ మోడళ్లలో ప్రత్యేకమైన డార్క్ ఎడిషన్లను మార్కెట్లో విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: