న్యూ మారుతి సుజుకి సెలెరియో విడుదల ఎప్పుడంటే..?

Purushottham Vinay
ఇండియా ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి కంపెనీ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కార్ మరికొంత ఆలస్యమైంది.నిజానికి,ఈ కార్ ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి భారత మార్కెట్లో విడుదల కావల్సి వుంది. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైంది.అయితే, మారుతి సుజుకి ఇప్పుడు ఈ కారును సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సెలెరియో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు మరింత శుద్ధి చేయబడిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది.ఈ కార్ ని కంపెనీ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తోంది. ఇది హియర్టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుందని సమాచారం.ఈ కారు అప్‌డేటెడ్ డిజైన్ ఇంకా అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.ఓల్డ్ జనరేషన్ మోడల్ కంటే ఈ కొత్త కార్ మరింత పెద్దదిగా ఉంటుందని ఇటీవల లీకైన చిత్రాలను చూస్తుంటే తెలుస్తుంది.

ఇక ఈ కారులో రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లు అలాగే బంపర్‌లతో రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా కలిగి ఉంటుంది. ఇక ఫస్ట్ జనరేషన్ మారుతి సెలెరియోతో పోలిస్తే, కొత్తగా రాబోయే ఈ మారుతి సెలెరియో ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఈ కొత్త కారులో మునుపటి కన్నా మరింత మెరుగైన క్యాబిన్ స్థలం ఉంటుందట.ఇక ఈ కార్ సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, దీనిలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు లాంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా వున్నాయి.ప్రస్తుతం మార్కెట్లో వున్న సెలెరియోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎక్కువ 68 బిహెచ్‌పి పవర్‌ను అలాగే 90 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని పెద్ద 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్‌పి శక్తి 113 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: