వైర్లెస్ చార్జింగ్ ఇ-బైక్ తయారు చేసిన కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్...

Purushottham Vinay
ఇండియాలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ బాగా పెరుగుతోంది.ఇక ఈ నేపథ్యంలోనే భాగంగానే చాలా కంపెనీలు తమ వెహికల్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ గా తయారుచేసి మార్కెట్లో అమ్ముతున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ రంగం బాగా అభివృద్ధి చెందదానికి ఇంకా అలాగే కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపడానికి, కారణం ఒకరకంగా పెరుగుతున్న ఇంధన ధరలని కూడా చెప్పాలి.ఇక ఇదిలా ఉండగా కొంతమంది స్టూడెంట్స్ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించి చాలా సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఇక ఇదే రీతిలో మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చి అందరిని ఆకట్టుకుంటుంది.నివేదికల ప్రకారం హైదరాబాద్ లోని కెఎల్ యనివర్శిటీలోని ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేస్తున్న ఆరుగురు థర్డ్ ఇయర్ ఇంకా ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఈ రకమైన ఎలక్ట్రిక్ బైక్ సృష్టించారు.

ఇక ఈ బైక్ ఇది చూడటానికి సైకిల్‌లా ఉంది కాబట్టి దీన్ని సైకిబైక్ లేదా బైస్కిబైక్ అని అంటారు. ఇక ఈ రోజుల్లో మొబైళ్లకు వెర్‌లెస్ టెక్నాలజీ అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా ఇప్పుడు వెర్‌లెస్ టెక్నాలజీతో పనిచేస్తుంది.ఇక ఈ టెక్నాలజీని బైకులకు సెట్ చెయ్యడం కొంత కష్టమైనప్పటికీ ఎట్టకేలకు సాధ్యం చేశారు ఈ స్టూడెంట్స్. ఇక ఈ సరికొత్త ప్రోటోటైప్ తయారుచేయడం వల్ల కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, ఇతర ఫ్యాకల్టీ తమ టెక్నాలజీని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది.ఇక ఈ వెర్‌లెస్ ఎలక్ట్రిక్ బైక్ స్పీడ్ విషయానికి వస్తే ఇది గంటకు 55 కిలోమీటర్లు స్పీడ్ ని ఇస్తుంది. ఇక అదే విధంగా ఈ బైక్ ఒక ఛార్జ్ తో 85 నుంచి 100 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది. కానీ దీనిని ఛార్జ్ చేయడానికి అయితే సుమారుగా 5 గంటల సమయం పడుతుంది.ఇక ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా సెల్ బ్యాలెన్సింగ్ ఫీచర్ అందుబాటులో ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: