మారుతీ మరో కీలక నిర్ణయం.. అదేంటంటే ?

Satvika
కరోనా కొనసాగుతున్న కష్ట సమయంలో ఆటోమొబైల్ రంగం కూడా కుదేలైందన్న సంగతి తెలిసిందే.. ఇక ఏప్రిల్ నెలలో కార్లను కొనుక్కోడానికి కూడా వినియోగదారులు పెద్దగా ఆసక్తిని చూపించలేదని తెలుస్తోంది. ఇక మారుతీ సుజుకీకి చెందిన 'వేగనార్ ఆర్' మోడల్ కారు బెస్ట్ సెల్లింగ్ కార్ గా నిలిచిందని అత్యధికంగా అమ్ముడైన కార్ల లిస్టులో టాప్ లో మారుతి సుజుకీ ఇండియా, హ్యుండై మోటార్ ఇండియా కంపెనీలకు చెందినవే ఉండడం విశేషం. మారుతీ సుజుకీకి చెందిన 7 మోడల్స్ కార్లు, హ్యుండైకు చెందిన మూడు కార్లు ఏప్రిల్ నెలలో టాప్ సెల్లింగ్ కార్స్ లిస్టులో ఉన్నాయి.

మారుతీ సుజుకీకి చెందిన వ్యాగనార్ ఆర్, స్విఫ్ట్, ఆల్టో, బలెనొ, డిజైర్, ఈకో, విటారా బ్రీజా మోడళ్ళు, హ్యుండై కు చెందిన క్రెటా, గ్రాండ్ 10 ఎన్ఐఓఎస్, వెన్యూ కార్లు ఎక్కువగా భారతీయులు కొన్నారని తాజా సర్వేలో తేలింది. ఇది ఇలా ఉండగా ,మారుతీసుజుకీ మెయింటనెన్స్‌ షట్‌డౌన్‌ను పొడిగించింది. గత నెలలో మే1 నుంచి 9వ తేదీ వరకు షట్‌డౌన్‌ ఉంటుందని వెల్లడించిన మారుతీ.. ఇప్పుడు దానిని మే 16వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీకి దాఖలు చేసిన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ గుజరాత్‌ ప్లాంట్‌ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇండియాలో కరోనా మహమ్మారి కోరలు చాచుతుంది., దేశంలో చాలా చోట్ల లాక్‌డౌన్‌లు విధించడంతో డిమాండ్‌ తగ్గింది. దీనికి తోడు ఆక్సిజన్‌ ఉత్పత్తిపై మారుతీ దృష్టిపెట్టడం కూడా ఒక కారణం.  భారత ప్రభుత్వం ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సంస్థలను.. పరిశ్రమల ఆక్సిజన్‌ వినియోగం తగ్గించాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం దానిని వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారు. ఏప్రిల్‌లో మారుతీ సుజుకీ మొత్తం 1,59,955 వాహనాలను ఉత్పత్తి చేసింది. మార్చి నెల(1,72,433)తో పోలిస్తే ఇది 7శాతం తక్కువ. కరోనా లాక్‌డౌన్లతో  ఉత్పత్తి తగ్గినట్లు మారుతీ తన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.. మారుతికి డిమాండ్ పెరిగినప్పుడు మళ్ళీ ఉత్పత్తిని ఓడలు పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: