ఈ మధ్య యువత ఎక్కువగా ఇష్టపడుతున్న కేటీఎం ఈ కంపెనీ యువతను మరింత ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. కొత్త ఫీచర్లతో తయారైన బైక్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చాలా బైక్ లను ఈ కంపెనీ అందుబాటులోకి తీసుకోవచ్చింది.. ధరతో పాటుగా ఈ బైక్ డబుల్ కిక్ ను కూడా ఇస్తుంది. మార్కెట్ లో వీటికి క్రేజ్ ఎక్కువ.. దీంతో యువత ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే ఈ బైక్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు కూడా ఉన్నాయని అంటున్నారు.. అవేంటో ఒక్కసారి చూద్దాం..
ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రియా మోటార్ సైకిళ్ల సంస్థ కేటీఎం తన 390 అడ్వెంచర్ బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది నవంబరులో ఈ ద్విచక్రవాహనాన్ని మిలాన్ మోటార్ సైకిల్ షోలో ప్రదర్శించింది. ఈ మోటార్ సైకిల్ కు పోటీగా ఉన్న బీఎండబ్ల్యూ జీ310 జీఎస్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేశారు. ఎక్స్ షోరూంలో కేటీఎం 390 మోటార్ సైకిల్ ధర 2.99 లక్షలు కాగా.. బీఎండబ్ల్యూ జీ310 జీఎస్ ధర వచ్చేసి రూ.3.49 లక్షలుగా ఉంది. బీఎండబ్ల్యూ కంటే తక్కువ కాస్ట్ కే అందుబాటులోకి వచ్చిన ఈ 390 అడ్వెంచర్ మోటార్ సైకిల్ మంచి డిమాండ్ ను మార్కెట్లో అందుకుంది.
ఇదే సమయంలో ఈ సిగ్మెంట్లో మరో మోడల్ ను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిది కేటీఎం సంస్థ. ఆ బైకే కేటీఎం 250 అడ్వేంచర్. ఈ ఏడాదే భారత మార్కెట్లోకి రానున్న ఈ మోటార్ సైకిల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కొన్ని ఉన్నాయనే వార్త షికారు చేస్తోంది.. మోడల్ తయారీ కన్నా కూడా అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారనే వార్త వినిపిస్తోంది. ఇది మార్కెట్ లోకి వచ్చిన చాలా రోజులకు బయటకు రావడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ ధర కాస్త ఎక్కువగానే ఉంది.. ఈ బైక్ కు ఎన్ని కంపెనీలు పోటీ వచ్చినా కూడా మార్కెట్లో ఈ బైక్ రారాజే అని చెప్పాలి..