గాల్లో ఎగిరే టాక్సీలు ఇండియాలోకి వస్తున్నాయా..!
బ్యాటరీతో నడిచే ఈ ఫ్లయింగ్ టాక్సీలకు 200 కిలోల పేలోడ్ సామర్థ్యం ఉంటుంది.లిథియం- అయాన్ బ్యాటరీలతో నడిచే ఈ టాక్సీలు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో 0.5 కిలోమీటర్ల నుండి 2 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. ఒక్కసారి దీన్ని ఛార్జ్ చేస్తే మొత్తం 200 కిలోమీటర్ల మేర ప్రయాణించగలవు. ఫుల్ ఛార్జింగ్తో దాదాపు 10 నుండి 20 ట్రిప్పులు చేయగలిగే సామర్థ్యం ఉంటుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిటిఓ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "దీనిలో ప్రయాణించేందుకు సాధారణ టాక్సీ కంటే 1.5 నుండి 2 రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది.
అయితే, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వేగంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. మా టాక్సీతో కేవలం 10 నిమిషాల్లోనే 10 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఒకేసారి ఇద్దరు ఇందులో ఇద్దరు ప్రయాణీకులను తీసుకెళ్లగలవు.ప్రయాణానికి కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ.. టాక్సీల సంఖ్య పెరిగే కొద్ది ఖర్చు తగ్గించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. భవిష్యత్తులో వీటి ప్రయాణ ఛార్జీలు ఇతర యాప్ -ఆధారిత టాక్సీ సర్వీసులతో సమానంగా ఉంటాయని పేర్కొన్నారు.త్వరలోనే మూడు లేదా నాలుగు సీట్ల సామర్థ్యంతో రూపొందనున్నాయి. అదే సమయంలో, వీటి ద్వారా కేవలం ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేయడమే కాకుండా కార్గో డెలివరీ సేవలను కూడా అందించాలని కంపెనీ ఆలోచన లో ఉంది..