లెక్సెస్ నుంచి మరొక లగ్జరీ కారు లాంఛ్.. ధర వింటే షాక్ అవ్వాల్సిందే ?
ఇకపోతే ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.2.15 కోట్లుగా సంస్థ నిర్ణయించింది. ఇక ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే.. లెక్సస్ ఎల్సీ 500హెచ్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్లో 3.5-లీటర్ సిక్స్ సిలీండర్ హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉండి.. 6600 ఆర్పీఎం వద్ద 354 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 3000 ఆర్పీఎం వద్ద 500 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా స్టాండర్డ్ పెయిర్డ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది..
లిమిటెడ్ ఎడిషన్ మోడల్ గా వచ్చిన ఈ వాహనాన్ని లెక్సస్, యోషిహిడే మోరుయా ఎయిర్ రైస్ పైలట్ ఇంజినీర్లు సంయుక్తంగా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఎయిరో డైనమిక్స్ సాంకేతికత పొందపరచడం వల్ల డ్రైవింగ్ అనుభూతి, సూపిరియర్ హ్యాండ్లింగ్ విభిన్నంగా ఉంటుంది.. ఇక కారు లోపల చూస్తే మొత్తం లెదర్ మెటీరియల్ తో అమర్చారు.యాక్సెంట్స్ సీట్లతో పాటు సీటు బెల్టులు, అల్కాంటారా బిట్స్ తో కవర్ చేసిన స్టీరింగ్ వీల్, షిఫ్ట్ లీవర్, డోర్ ట్రిమ్స్ లాంటివి ఇక్కడ పొందుపరిచారు.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఈ కంపెనీ కొత్త కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.